మహేష్‌బాబు దత్తత, ఎన్నికలముందే ప్లాన్: జయదేవ్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి మండలంలో గల బుర్రిపాలెం గ్రామాన్ని తన బావమరిది, ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు త్వరలో దత్తత తీసుకుంటారని గుంటూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ చెప్పారు.

స్థానికంగా ఉన్న జెడ్పీ హైస్కూలు ఆవరణలో సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు గల్లా జయదేవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుర్రిపాలెంను దత్తత తీసుకొని, స్మార్ట్ విలేజ్‌గా మార్చాలని తాను, హీరో మహేష్ బాబు ఎన్నికలకు ముందే అనుకున్నామన్నారు.
ప్రజాప్రతినిధులు స్వగ్రామం, అత్తగారి ఊర్లను దత్తత తీసుకోకుండదన్న నిబంధనలు ఉండటంతో అది కార్యరూపం దాల్చలేదన్నారు. దీంతో తన భార్య, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె పద్మ తెనాలి మండలం కంచర్లపాలెంను, తన బావమరిది మహేష్ బాబు అతని స్వగ్రామాన్ని దత్తత తీసుకోనున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications