దారుణం: మాయమాటలు చెప్పి మహిళపై సామూహిక అత్యాచారం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... స్థానిక రామలింగేశ్వరపేటకు చెందిన 20 ఏళ్ల వివాహిత భర్తతో విభేదాల వల్ల కొంతకాలంగా బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. ఈనేపథ్యంలో ఇదే ప్రాంతానికి చెందిన యువకులు టి గోపి, ఎం ఆనంద్, పి సుబ్బు ఆమెతో పరిచయం పెంచుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వన్ టౌన్ ఇన్‌చార్జ్ సిఐ ఎన్ రామారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసిన ఎస్‌ఐ హసన్ అహ్మద్ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.












Click it and Unblock the Notifications