పొలాల్లోకి లాక్కెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో ఈ నెల 11వ తేదీ రాత్రి జరిగిన సామూహిక అత్యాచార సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, ఇప్పటివరకు దీనిపై కేసు నమోదు చేయలేదని దేవరపల్లి ఎస్‌ఐ ఆర్.శ్రీను తెలిపారు. గ్రామంలో పొగాకు పొలంలో పనిచేసేందుకు వెళ్లిన యువతి సాయం త్రం ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు అటకాయించి, సమీప పొలాల్లోకి లాక్కెళ్లి తమతో తెచ్చుకున్న మద్యాన్ని బలవంతంగా ఆమెకు పట్టించి అత్యాచారానికి పాల్పడ్డారంటూ మీడియాలో వార్తలు రావడం సంచలనం సృష్టించింది.
ఆసమయంలో అమానుషంగానూ ప్రవర్తించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అనంతరం అమెతో పాటు బైక్‌పై వెళ్లిపోవడానికి ప్రయత్నించి పడిపోవడంతో ఆ యువతి తలకూ గాయమైంది. దాంతో వారు అమెను వదిలి పరారయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఆ యువతి గ్రామం సమీపంలో పడి ఉండడానికి గమనించిన ఒక రైతు ఆమెను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అనంతరం ఆమె పరిస్థితిని గమనించి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. మెడికో లీగల్ కేసు కావడంతో ఈ సమాచారాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి సంబంధిత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాలికపై అత్యాచారం
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో మైనర్ బాలిక ఈనెల 13వ తేదీ రాత్రి అత్యాచారానికి గురైంది. కిరాణా సామాన్ల కొనుగోలు కోసం దుకాణానికి వచ్చిన బాలికను అదే గ్రామానికి చెందిన తమలంపూడి తాతాజీ అనే వ్యక్తి ప్రక్కనే ఉన్న షెడ్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కడియం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. బాలిక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications