విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో గ్యాంగ్‌వార్: కత్తులు, రాళ్ల దాడులతో రెచ్చిపోయిన విద్యార్థులు, ఒకరు మృతి

|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడలో కాలేజీ విద్యార్థులు వీధి రౌడిల్లా రెచ్చపోయారు. నడిరోడ్డుపై కత్తులు, రాళ్ల దాడులతో వీరంగం సృష్టించారు. పడమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తడంతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీంతో పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించారు.

ఈ దాడులతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, ఈ గ్యాంగ్‌వార్‌లో రాజకీయ పార్టీల నేతల అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విద్యార్థుల ఘర్షణకు యనమలకుదురులోని రూ. 2 కోట్ల విలువైన భూమి కారణమని తెలిసింది.

gang war in vijayawada: two student groups fight with knives, few injured

ల్యాండ్‌డీల్‌కు సంబంధించి రెండు గ్రూపులు జోక్యం చేసుకోవడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు గ్రూపులకు చెందిన సుమారు 30 మందికిపైగా కాలేజీ విద్యార్థులు కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీంతో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Recommended Video

Pawan Kalyan Slams AP Govt Over Sand Mafia In West Godavari

కాగా, ఈ వివాదంలో మాజీ రౌడీషీటర్ ఒకరు జోక్యం చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం కూడా ఉందని వార్తలు వస్తుండటంతో పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

English summary
gang war in vijayawada: two student groups fight with knives, few injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X