వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతివాదిగా చంద్రబాబు పేరు తొలగింపు: మాళవిక పిటిషన్‌పై 7న విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన భర్తను తెలంగాణలోని ఏదైనా జైలుకు తరలించాలని కోరుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డి భార్య మాళవిక దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఈ పిటిషన్‌లో రెస్పాండెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరును మాళవిక ప్రస్తావించడాన్ని తొలగించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. సిఐడి అధికారులు ఇటీవల మారిషస్‌లో ఉన్న గంగిరెడ్డిని అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

 gangireddy's wife petition will be taken up on Dec 7

ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో గంగిరెడ్డి విచారణ ఖైదీగా ఉన్నారు. తన భర్తకు ప్రాణహాని ఉందని మాళవిక పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారించిన తర్వాత హైకోర్టు ఉన్నత స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పేరును రెస్పాండెంట్‌గా చేర్చడం తగదని, ఈ పేరును పిటిషన్ నుంచి తొలగించాలని ఆదేశించింది.

అనంతరం ఈ కేసును ఈ నెల 7వ తేదీన విచారణకు స్వీకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కడప జైలులో ఉన్న తన భర్త గంగిరెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి ప్రాణహాని ఉందని మాళవిక ఆరోపించిన విషయం తెలిసిందే.

English summary
High Court ordered to delete Andhra Pradesh CM Nara Chandrababu Naidu's name as respondant in Red sanders smuggler Gangi Reddy's wife petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X