పూజాహెగ్డేకు మరో అవకాశం ఇప్పించిన త్రివిక్రమ్?
బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కస్, కిసీకాభాయ్ కిసీకాజాన్ లాంటి సినిమాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. దీని ప్రభావం పూజా హెగ్డేపై పడింది. అప్పటివరకు గోల్డెన్ గర్ల్ గా ఉన్న పూజా ఐరన్ లెగ్ గా మారిపోయింది. ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి పోటీపడినవారంతా ఇప్పుడు వద్దు అంటున్నారు. వరుసగా రెండు సంవత్సరాల్లో గట్టి ఆడిన సినిమా ఏదీ లేకుండా పోయింది.
ఇటువంటి తరుణంలోనే మంచి అవకాశం వచ్చింది. అదే.. గుంటూరు కారం. మహేష్ బాబు పక్కన కథానాయికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అవకాశం కల్పించారు. అంతకుముందు త్రివిక్రమ్ అరవింద సమేత, అల వైకుంఠపురంలో అవకాశాలిచ్చారు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి పూజా తప్పుకుందంటూ వార్తలు వచ్చాయి. మహేష్ బాబు అండ్ టీమ్ పూజాను పక్కన పెట్టించారంటూ ఒకవైపు వార్తలు రాగా, మరోవైపు నుంచి పూజా పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో తానే తప్పుకుందంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

పూజాకు ఇటువంటి అనుభవం ఇంతవరకు ఎదురుకాలేదు. మహేష్ బాబు సినిమా కాబట్టి త్రివిక్రమ్ కూడా ఏమీ మాట్లాడలేకపోయారంటున్నారు. అయితే బుట్టబొమ్మకు త్రివిక్రమ్ మరో అవకాశం ఇప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సాయిధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.
దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోందనే విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మెగా క్యాంప్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్‌లతో పూజా హెగ్డే ఇప్పటికే జోడీ కట్టింది. త్వరలోనే సాయిధరమ్ తేజ్‌తోనూ నటించబోతోంది. ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది గాంజా శంకర్ (Ganja Shankar) అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications