వైసీపీ అలర్ట్ - నో డైలాగ్స్ ,ఓన్లీ యాక్షన్..!

గన్నవరం: గన్నవరం రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. లోకేష్ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా యార్లగడ్డ నియామకంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ అలర్ట్ అవుతోంది. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వంశీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. తాజా పరిణమాలతో వైసీపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది.

కృష్ణా జిల్లాలో ఈ సారి ఎన్నికల్లో హోరా హోరీగా మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో జిల్లాలో రెండు సీట్లు మినహా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి టీడీపీ, జనసేన పొత్తుతో తిరిగి పూర్వ వైభవం సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రెండు గుడివాడ, గన్నవరంలో కొడాలి నాని...వల్లభనేని వంశీ పైన టీడీపీ ప్రత్యేకంగా గురి పెట్టింది. జిల్లాలో లోకేష్ పాదయాత్ర వేళ ప్రత్యేకంగా గన్నవరం పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు స్పష్టం అయింది. జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో లోకేష్ యాత్ర విజయవాడ నగరంతో పాటుగా పెనమూలూరు, గన్నవరం లో ముగించి నూజివీడులో కొనసాగుతోంది. ఎంపీ కేశినేని నాని యాత్రకు దూరంగా ఉన్నారు.

Gannavaram Politics: Vallabhaneni vamsi on alert as TDP focus in his constituency goes strong

లోకేష్ యాత్ర ఏర్పాట్లను కేశినేని చిన్నికి అప్పగించటంతో నాని పూర్తిగా దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నానితో దూరంగా ఉంటున్న టీడీపీ నేతలు లోకేష్ యాత్ర నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.అటు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కొడాలి నాని, వంశీ లక్ష్యంగా హెచ్చరికలు చేసారు. గన్నవరంలో లోకేష్ వార్నింగ్‌లు, కామెంట్స్ వైరల్ అయ్యాయి.

గన్నవరం నుంచి వెంకట్రావు టీడీపీలో చేరటంతో, మరో నేత దుట్టాతో ఎంపీ వల్లభనేని బాలశౌరి మంతనాలు చేసారు. ఆయన పార్టీలోనే కొనసాగేలా చర్చలు చేసినట్లు తెలుస్తోంది. గన్నవరంలో వైసీపీ నుంచి వంశీ పోటీ చేయటం ఖాయమైంది. దీంతో వంశీకి సహకారం అందించాలని, దుట్టాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.జనసేనతో పొత్తు తమకు కలిసి వస్తే గన్నవరంలో అనుకున్నది సాధిస్తామని టీడీపీ చెబుతోంది.

Gannavaram Politics: Vallabhaneni vamsi on alert as TDP focus in his constituency goes strong

అయితే, వంశీ ఇప్పటి నుంచే పూర్తిగా రానున్న ఎన్నికల కోసం రంగంలోకి దిగారు. వంశీకి ఉన్న అనుచర వర్గం, మద్దతుతో పాటుగా సంక్షేమ పథకాల ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన దాసరి బాలవర్ధన్ రావు కొద్ది రోజుల క్రితం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అయితే, వెంకట్రావుకు టీడీపీ టికెట్ ఇస్తే దాసరి సోదరులు సహకరిస్తారా లేదా అనేది సందేహమే.

ఇక, నియోజకవర్గంలో పరిస్థితులను పూర్తిగా అనుకూలంగా మలచుకొనేందుకు వంశీ ఒక నివేదికతో త్వరలో సీఎంను కలవనున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం ప్రారంభానికి సిద్దం అవుతున్నారు. దీంతో, గన్నవరం రాజకీయం ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+