నాతో సహా బయటకెళ్తారు: పార్టీ వీడేందుకు గంటా సిద్ధం!

Ganta Srinivas Rao
హైదరాబాద్: సిడబ్ల్యూసి నిర్ణయం శిరోధార్యమే అయినా ప్రజా నిర్ణయమే తమకు అధిష్ఠానమని మంత్రి గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆరోపించారు. సిడబ్ల్యూసి ది నూరుశాతం తప్పుడు నిర్ణయమన్నారు. పదిహేడు రాష్ట్రాల్లో విభజన కోరుతుంటే ఆంధ్రప్రదేశ్‌నే విడదీయాలనుకోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు.

రెండుసార్లు యూపిఏ అధికారంలోకి రావడానికి కారణమైన రాష్ట్రాన్ని స్వార్థంకోసం విడదీయాలనుకోవడం అవివేకమన్నారు. శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటుచేసి, అది ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసిందన్నారు. ఆంటోనీ కమిటీ పేరిట ప్రజలను మోసగించిందని విమర్శించారు. ఢిల్లీ పెద్దల్లోనే విభజనపై స్పష్టత లేదన్నారు.

హైదరాబాద్‌ను యూటీ చేయాలనడం చిరంజీవి వ్యక్తిగతమన్నారు. హక్కుల కోసం కాకుండా విభజన ఆగేవరకు పోరాడాలని కేంద్రమంత్రి పురంధేశ్వరి వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్నారు. తనపై పార్టీ ఏ చర్య తీసుకున్నా సిద్ధమే అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తీర్మానించిన ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ బొత్స, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరిపైనా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానాన్ని ధిక్కరించినప్పుడు వారిపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

సీమాంధ్ర ప్రజల మనోభావాలు గుర్తించకుండా అధిష్టానం విభజనకే మొగ్గు చూపితే చాలామంది సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు పార్టీని వీడటం ఖాయమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+