వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్‌కి షాక్: రాజ్యసభ రేస్‌లో గంటా, నాటి పిఆర్పీ అండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో తెర పైకి కొత్తగా మంత్రి గంటా శ్రీనివాస రావు పేరు వచ్చింది. విభజనపై అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెసు నేతలు సమైక్యాంధ్ర నినాదంతో రాజ్యసభ ఎన్నికల ద్వారా అధిష్టానంపై బాణం ఎక్కు పెడుతున్నారు. సమైక్యాంధ్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు నేతలు ఇప్పటికే ప్రకటించారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చైతన్య రాజులు ఇప్పటికే రాజ్యసభ బరిలో దిగేందుకు సిద్ధం కాగా ఇప్పుడు గంటా పేరు తెర పైకి వచ్చింది.

దీంతో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎవరి లెక్కల ప్రకారం వారు అభ్యర్థులను నిలుపుకొని సాఫీగా సాగిపోయే తంతు కాస్తా కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. విభజన విషయంలో తమను ఏమాత్రం ఖాతరు చేయలేదని, ఏ దశలోనూ తమకు విలువ ఇవ్వలేదని కసిగా ఉన్న సమైక్య శిబిరం అధిష్ఠానానికి తమ సత్తా చాటాలని నిర్ణయించుకుంది. నందమూరి హరికృష్ణ రాజీనామాతోపాటు ఐదుగురి పదవీ విరమణ నేపథ్యంలో రాష్ట్రం నుంచి మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి.

వచ్చేనెల 7న వీటికి ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కాంగ్రెస్ ఖాయంగా మూడు స్థానాలు గెలుచుకుంటుంది. లెక్కలు పక్కాగా వేస్తే నాలుగో స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో బరిలో ముగ్గురిని నిలపాలా, నలుగురిని దించాలా అనే అంశంపై తర్జనభర్జనలు పడుతుండగానే సీమాంధ్ర నేతల నుండి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన జెసి, చైతన్య రాజులు ఎమ్మెల్యేలతో సంతకాలు చేయిస్తున్నారు.

గంటా కూడా కాంగ్రెస్ రెబెల్‌గా రంగంలోకి దిగాలని భావిస్తున్నారట. ఆషామాషీ పోటీ వద్దని, ఈ విషయంలో అధిష్ఠానానికి బలమైన సంకేతాలు పంపిద్దామని, ఎవరో ఎందుకు, మీరే నిలబడండని తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, అందులోనూ నాటి ప్రజారాజ్యం తరఫున గెలిచి కాంగ్రెస్‌లో విలీనమైన వారు గంటాపై ఒత్తిడి తెస్తున్నారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని చాంబర్‌లో పలువురు ఎమ్మెల్యేలు గంటాను కలిశారు. సమైక్యాంధ్ర నినాదంతో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని గంటాను కోరారు.

ఆయన దీనిపై సానుకూల కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జెసి, గంటా ఇద్దరూ సమైక్యాంద్ర నినాదంతో బరిలో నిలిస్తే పోటీ రసవత్తరంగా మారుతుందని, జెసి కంటే గంటా బలమైన అభ్యర్థి అవుతారని, ఇద్దరూ గెలిస్తే అధిష్ఠానానికి సమైక్యవాదం దెబ్బను రుచి చూపించినట్లవుతుందని, ఒక్కరిని గెలిపించుకున్నా తమ లక్ష్యం నెరవేరినట్లేనని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారిక అభ్యర్థుల అవకాశాలకు గండి కొట్టేందుకు మజ్లిస్ సభ్యులతోనూ చర్చలు జరుపుతున్నారు.

English summary
It is said that Minister Ganta Srinivas Rao is in race of Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X