మీ పిల్లలకు ఇలాగే పెడతారా, మీలాంటోళ్లని ఉరితీయాలి: ఊగిపోయిన గంటా

విశాఖ: మంత్రి గంటా శ్రీనివాస రావు శనివారం నాడు సింహాచలంలోని బీసీ హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్లో ఆయన అకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో ఉన్న సౌకర్యాల పైన మంత్రి గంటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతులను చూసి, ఆశ్చర్యపోయిన గంటా సిబ్బంది పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganta Srinivas Rao fires at hostel staff

దాదాపు రెండు గంటల పాటు గంట హాస్టల్లోనే ఉండి, అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డార్మిటరీ, కిచెన్, తరగతి గదులు, డైనింగ్ హాల్.. ఇలా అన్నింటిని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు మంచాలు కూడా సరిగా లేవని, ఫ్యాన్లు లేవని గుర్తించారు.

Ganta Srinivas Rao fires at hostel staff

దీంతో, సిబ్బంది పైన గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటకు ఉపయోగించే నీటి ట్యాంకుల పైన మూతలు లేకుండటాన్ని ఆయన గుర్తించారు. నీటిలో చెత్త, పురుగులు కనిపించాయి. దీంతో గంటా ఆవేశంతో ఊగిపోయారు. 'మీ పిల్లలకు ఇటువంటి స్థితిలో వంట వండి తినిపిస్తావా? మీ లాంటి వాళ్లను ఉరితీయాలి' అని విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+