శ్రీనివాసుడిని దర్శించుకున్న గంటా
చిత్తూరు: తిరుమల స్వామి వారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు తో పాటు మరో టీడీపీ నాయకుడు, ఎంపీ సియం రమేష్ లు తెల్లవారు జామున విఐపీ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. వీరే కాక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య, చింతా మోహన్ తదితరులు కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. కార్తీక మాసం మొదలు కావడంతో తిరుమలలో భక్తల రద్దీ గణనీయంగా పెరిగింది. బుధవారం తెల్లవారు జామునుండి తిరుమలలో వర్షం కురుస్తుండటంతో స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు కొంత ఆటంక కలిగింది.












Click it and Unblock the Notifications