శ్రీవారి గరుడ సేవకు పోటెత్తిన భక్తులు, తోపులాట
తిరుమల: అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన గరుడ వాహన సేవను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. భారీగా భక్తులు స్వామి వారి గరుడ వాహన సేవను చూసేందుకు లక్షల సంఖ్యలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో నాలుగు మాడవీధులు కిక్కిరిసిపోయాయి. దీంతో వెంగమాంబ అన్నదాన సత్రం ప్రవేశద్వారం వద్ద తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. టీటీడీ ప్రతి ఏటా నిర్వహించే ఈ గరుడ వాహన సేవను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో ఆస్థాన మండపం, వసంత మండపం, వరాహస్వామి గెస్ట్ హౌజల వద్ద భారీగా భక్తులు ఉన్నారు. భక్తులను అదుపు చేయడానికి పోలీసుల తీవ్రంగా శ్రమించారు.












Click it and Unblock the Notifications