సంబంధం లేదు, వేర్వేరు: కెసిఆర్ వ్యాఖ్యలపై జగన్ పార్టీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ముఖ్యమంత్రి అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు శనివారం చెప్పారు. కెసిఆర్ వ్యాఖ్యలను పట్టుకొని తెరాసకు తమ పార్టీకి మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ లేనిపోని సంబంధాన్ని అంటగట్టేందుకు తెలంగాణ కాంగ్రెసు నేతలు ప్రయత్నించడం సరికాదన్నారు.
విభజన కోసం కెసిఆర్ ఉద్యమం చేశారని, జగన్ మాత్రం సమైక్యాంధ్ర కోసం పోరాడారన్నారు. వారిద్దరి సిద్ధాంతాలు, ఆలోచనలు పూర్తిగా వేరుగా ఉన్నాయన్నారు. కెసిఆర్‌తో అన్ని విధాలా అంటకాగింది కాంగ్రెసు నేతలే అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు నోరుందని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.

తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో.. జగన్ గెలుపు అంతే సహజమన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేకపోయినప్పటికీ టి కాంగ్రెసు నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ జగన్, కెసిఆర్‌ల మధ్య ఒప్పందమని చెప్పడం సరికాదని ఆయన అన్నారు.
జగన్, కెసిఆర్‌లు భిన్న ధృవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రెండు వేర్వేరు ప్రజా ప్రయోజనాలతో పోరాటం చేస్తున్న పార్టీలని, వీటి మధ్య ఎలాంటి చీకటి ఒప్పందాలు ఉండవన్నారు. దుర్మార్గమైన ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దన్నారు.












Click it and Unblock the Notifications