జగన్ పార్టీకి షాక్: సభాహక్కుల నోటీసుకు సిద్ధమైన గీత

న్యూఢిల్లీ: తనను దుర్భాషలాడిన వైయస్సార్ కాంగ్రెస్ నాయకులపై ఆ పార్టీ లోక్‌సభ సభ్యురాలు కొత్తపల్లి గీత స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు సభా హక్కుల నోటీసు ఇవ్వనున్నారు. తమ పార్టీకి చెందిన కొందరు నాయకులు నెట్‌లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని కొత్తపల్లి గీత సోమవారం స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సుమిత్రా మహాజన్‌తో చర్చలు జరిపిన అనంతరం సభా హక్కుల నోటీసు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. సభా హక్కుల నోటీసులో తను చేస్తున్న ఆరోపణలను నిరూపించేందుకు ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు తనపై ఇంటర్‌నెట్‌లో పెట్టిన అసభ్య చిత్రాలు, రాతల ప్రతులు, ఆంధ్రప్రదేశ్ డిజిపి జరిపించిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలను పొందుపరుస్తున్నారు.

Geetha wants to give Notice of privilege notices to YSRCP

తన ఆరోపణలను నిరూపించేందుకు కొత్తపల్లి గీత సాక్ష్యాలను అందజేసిన పక్షంలో స్పీకర్ ఈ కేసును లోక్‌సభ సభా హక్కుల కమిటీ పరిశీలనకు పంపించే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా కొత్తపల్లి గీత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేయకుండా చూసేందుకు ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+