వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కన్నా మనమే బెట్టర్: ఎస్ఎస్‌సి ఫలితాలపై గంటా

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలంగాణలో కన్నా తమ రాష్ట్రం ఎస్ఎస్‌సి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్‌సి ఫలితాలను ఆయన బుధవారంనాడు విడుదల చేశారు. ఎపి ఎస్ఎస్‌సిలో 91.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, తెలంగాణలో 77.5 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని ఆయన చెప్పారు.

ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాల్లోనూ తెలంగాణ కన్నా తమ రాష్ట్రంలోనే ఫలితాలు ఉత్తమంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఎపిలో సున్నా ఫలితాలు సాధించిన పాఠశాల ఒకటి ఉండగా తెలంగాణలో 58 పాఠశాలలు ఉన్నాయని ఆయన చెప్పారు.

Ghanta Srinivas rao

ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, తదితర పాఠశాలల్లో ఎపి సాధించిన ఫలితాలతో తెలంగాణ సాధించిన ఫలితాలను ఆయన పోల్చి చెప్పారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్‌సి పరీక్షల్లో 91.42 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. ఎస్ఎస్‌సి పరీక్ష ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా ఉంది. బాలికలు 91.71 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 91.15 శాతం ఉత్తీర్ణులైనట్లు ఆయన తెలిపారు.

నిరుటి కన్నా ఉత్తీర్ణతా శాతం 0.26 శాతం పెరిగినట్లు గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఫలితాల సాధనలో కడప డిల్లా 98.54 శాతంతో అగ్రస్థానంలో నిలువగా 71.29 శాతంతో చిత్తూరు చివరి స్థానంలో నిలిచింది. ప్రైవేట్ పాఠశాలల్లో అత్యధికంగా 96.6 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు ఆయన తెలిపారు.

ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో 3645 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. రెండు పాఠశాలలు సున్నా ఉత్తీర్ణత సాధించాయి. జడ్పీ పాఠశాలల్లో 89 శాతం ఉత్తీర్ణత కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో 85 శాతం, ఎయిడెడ్ పాఠశాలల్లో 85.2 శాతం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 92.91 శాతం., పురపాలక పాఠశాలల్లో 83.72 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

జూన్ 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 18వ తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఈ రోజు నుంచి 12 రోజుల్లోగా రూ.500 చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు.

జిల్లావారీగా ఉత్తీర్ణత శాతం

శ్రీకాకుళం - 92.79, విజయనగరం - 92.99, విశాఖ - 91.76, తూర్పు గోదావరి - 96.75, పశ్చిమ గోదావరి - 95.15, కృష్ణా - 91.36, గుంటూరు - 94.59, ప్రకాశం - 91.83, నెల్లూరు - 90.29, చిత్తూరు - 71.29, కడప - 98.54, అనంతపురం - 93.11, కర్నూలు - 90.97

English summary
Releasing Andhra Pradesh SSC results, minister Ghanta Srinivas Rao said that AP has acheived better pass percentage when compared to Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X