హెరిటేజ్ నెయ్యి మేం కొన్లేదు-మీరే భారతీ సిమెంట్ కొన్నారు..!

ఏపీలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేంద్రంగా జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి చెక్ పెట్టే లక్ష్యంతో ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు (Chandrababu)ప్రభుత్వం సుదీర్ఘ చర్చ చేపట్టింది. ఇందులో మాట్లాడిన సీఎం చంద్రబాబు వైసీపీ చేస్తున్న పలు ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో హెరిటేజ్ నెయ్యిని టీటీడీ కొనుగోలు చేసిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. మీ భారతీ సిమెంట్ నే ప్రభుత్వ పనులకు సరఫరా చేశారంటూ జగన్ కు కౌంటర్ ఇచ్చారు.

హెరిటేజ్ తన కుటుంబ వ్యాపార సంస్థ అని, ప్రభుత్వంలో ఎక్కడా దాని ఉత్పత్తులు సరఫరా చేయలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకూ హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యిని కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదన్నారు. కానీ వాళ్ల పత్రికలో ఈ సంస్థపై వ్యతిరేక కథనాలు రాశారన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా నీతి నిజాయతీతో హెరిటేజ్ నిలబడిందని గుర్తుచేశారు. అదే సమయంలో భారతీ సిమెంట్స్ నుంచి కొన్న సిమెంట్ ను ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ప్రాజెక్టుల్లో వినియోగించారని ఆరోపించారు.

Ghee vs Cement Chandrababu Rejects Heritage Charge Claims YSRCP Regime Favoured Bharati Cement

నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీకు ముడిపెట్టే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు నెయ్యి విషయంలో సంబంధం లేదన్నారు. పూణేలో ఉన్న ఇందాపూర్ డెయిరీ ప్రసిద్ధ కంపెనీలన్నిటికీ కో మాన్యుఫాక్చరింగ్ చేస్తోందని తెలిపారు. మదర్ డెయిరీ, బ్రిటానియా, ఆయుర్వేద ఘీ పతంజలి, డిమార్ట్, రిలయన్స్, దొడ్ల, హాడ్సన్ , జీఆర్బీ, అముల్, హెరిటేజ్ లాంటి సంస్థలకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారన్నారు. కో మాన్యు ఫాక్చరింగ్ చేస్తున్న ఇందాపూర్ డెయిరీ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+