కూల్చేయమన్నారు: 'నాగ్' ఎన్ కన్వెన్షన్‌పై కమిషనర్
హైదరాబాద్/చిత్తూరు: అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని న్యాయస్థానం గతంలో ఆదేశించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ మంగళవారం తెలిపారు. ప్రముఖ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయమై ఆయన స్పందించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదం పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్టే లేదని ఆయన చెప్పారు. అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని కోర్టు తెలిపిందన్నారు. కాగా, ఈ నెల 26, 27 తేదీలలో నగరంలో బోనాలు ఉత్సవాలు ఉంటాయని చెప్పారు. హలీం బట్టీలో మొదటి, రెండో అంతస్తుల్లో నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్కూళ్లను సీజ్: కలెక్టర్
జిల్లాలో 174 అనుమతి లేని పాఠశాలలు ఉన్నాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 34 పాఠశాలలను మూసివేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా నడుస్తున్న మిగతా పాఠశాలలను కూడా మూసివేస్తామని ఆయన తెలిపారు.
ఎర్రచందనం స్మగ్లర్ల బహిరంగ విచారణ
ఇద్దరు అటవీ అధికారుల హత్య కేసులో నిందితులైన 346 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై మంగళవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో బహిరంగ విచారణ జరిగింది. కోర్టు హాలు సరిపోదనే ఉద్దేశంతో పోలీసులు తారకరామ స్టేడియంలో నిందితులను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు.
డిసెంబర్ 15, 2013న తిరుమల శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీ అధికారులు హత్యకు గురయ్యారు. అనంతరం అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు జరిపిన పోలీసులు మూడు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. దాదాపు 446 మందిపై కేసు నమోదు చేయగా 346 మంది నిందితులను అదుపులోకి తీసుకుని కడప, నెల్లూరు జైళ్లకు తరలించారు. తిరుపతిలో బహిరంగ విచారణ నేపథ్యంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications