నిర్మాణాల కూల్చివేతలు: ఆపాలని జిహెచ్ఎంసి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని జిహెచ్ఎంసి గురువారం తీర్మానం చేసింది. అక్రమ నిర్మాణాలకు సహకరించిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోకుండా.. నిర్మాణాలను కూల్చేయడం సరైంది కాదని జిహెచ్ఎంసి భావిస్తోంది.
క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరాలని పాలక మండలి నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ పాలక మండలి సభ్యులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకోవాలని కోరినట్లు సమాచారం.
కాగా, నగరంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత కొనసాగుతోంది. గురువారం ఉదయం ఎల్‌బీనగర్ సర్కిల్, పాత కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సర్కిల్‌లో కూల్చివేతలు కొనసాగాయి. గురువారం మొత్తం 19 అక్రమ భవనాలను కూల్చివేశారు. ఇప్పటి వరకు జిహెచ్ఎంసి పరిధిలో దాదాపు 30 భవనాలను కూల్చివేశారు.
కూకట్‌పల్లి, మధురానగర్‌లలోనూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముషీరాబాద్ రాంనగర్‌లో 3అంతస్తుల భవనం, చర్లపల్లి నవోదయనగర్‌లో మూడంతస్తుల భవనం, సికింద్రాబాద్‌లో 4 అంతస్తుల భవనం కూల్చివేశారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి దేవాలయం పరిసరాల్లోని ఓ భవనాన్ని కూడా అధికారులు కూల్చివేశారు.

కూల్చివేతలు
నగరంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత కొనసాగుతోంది. గురువారం ఉదయం ఎల్‌బీనగర్ సర్కిల్, పాత కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సర్కిల్‌లో కూల్చివేతలు కొనసాగాయి.

కూల్చివేతలు
ఇప్పటి వరకు జిహెచ్ఎంసి పరిధిలో దాదాపు 38 భవనాలను కూల్చివేశారు. కూకట్‌పల్లి, మధురానగర్‌లలోనూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

కూల్చివేతలు
కూకట్‌పల్లి, మధురానగర్‌లలోనూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముషీరాబాద్ రాంనగర్‌లో 3అంతస్తుల భవనం, చర్లపల్లి నవోదయనగర్ లో మూడంతస్తుల భవనం, సికింద్రాబాద్‌లో 4 అంతస్తుల భవనం కూల్చివేశారు.

కూల్చివేతలు
సికింద్రాబాద్ లోని మహంకాళి దేవాలయం పరిసరాల్లో ఓ భవనాన్ని కూడా అధికారులు కూల్చివేశారు.

కూల్చివేతలు
నగరంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని జిహెచ్ఎంసి తీర్మానం చేసింది.












Click it and Unblock the Notifications