స్నేహితురాలిపై మృతికి కలత: అమ్మాయి ఆత్మహత్య

Girl commit suicide in Hyderabad
హైదరాబాద్: హైదరాబాదు శివారులోని చందానగర్‌లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.
నెల రోజుల క్రితం తొటి స్నేహితురాలు మృతి చెందడంతో ఓ బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.

గోపినగర్‌లో నివాసం ఉంటున్న గోవిందస్వామి అర్ముఖం కుతూరు కౌసల్య(14) శేరిలింగంపల్లి ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. అదే తరగతిలో ఆ బాలికకు స్నేహితురాలు ఉంది. ఒకే వయస్సు కావడంతో ఇంట, బయటా తిరుగుతూ వారు చాలా స్నేహంగా మెలిగేవారు. అంతలోనే కౌసల్య స్నేహితురాలు మృతి చెందింది. ఆది తట్టుకోలేని కౌసల్య నెల రోజుల నుంచి బాధ పడుతూ ఉంది.

తీవ్ర మనస్తాపానికి గురైన కౌసల్య సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. మంటలకు తట్టుకోలేక కేకలు వేస్తూ ఇంటి బయటికి వచ్చింది. అది గమనించిన చుట్టపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకునే సరికే కౌసల్య అక్కడిక్కడే మృతి చెందింది.

కౌసల్య తండ్రి చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+