ఇంజక్షన్ వికటించి బాలిక జ్వరం తో మృతి

Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరు జిల్లా దుర్గి లో విషజ్వరాలు ప్రబలి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మాచర్ల వద్ద దుర్గి లో నివాసం ఉంటున్న కలెవెల శ్రావణి అను బాలిక రెండు రోజులుగా జ్వరం తో భాధపడుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు మామూలు జ్వరం అనుకుని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో శ్రావణి కి ట్రీట్ మెంట్ ఇస్తున్న డాక్టర్ జ్వరం తగ్గేందుకు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం శ్రావణి ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించింది. వెంటనే తల్లిదండ్రులు శ్రావణిని మరో ఆసుపత్రికి తరలించారు. మాచర్ల పట్టణం లో చికిత్స కోసం తీసుకెళ్లగా అక్కడ కూడా శ్రావణి పరిస్థితి విషమంగా ఉందని గ్రహించిన డాక్టర్స్ చేయగలిగింది ఏమీ లేదని చెప్పారు.

Girl dies after the injuction was done

ఈ క్రమంలో మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి శ్రావణి ని తలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందింది అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శ్రావణి విషజ్వరం తో ఆసుపత్రికి వెళ్లగా అక్కడ చేసిన ఇంజక్షన్ వికటించి తమ బిడ్డ అప్పటికే మృతి చెందింది అని ఆరోపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl has dead after the injuction was done at Durgi in Guntur district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి