అనుమానాస్పద మృతి: చర్చి రెండో అంతస్థులో రక్తం మడుగులో బాలిక

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం డోలాసునగర్ లో చర్చి రెండవ అంతస్తు లో మూడేళ్ళ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది.

గుంటూర: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం డోలాసునగర్ లో చర్చి రెండవ అంతస్తు లో మూడేళ్ళ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. చర్చి రెండవ అంతస్తు లో మూడేళ్ళ చిన్నారి గౌను, కాళ్ళ పట్టీలు భద్రం గా ఓ ప్రక్క పెట్టి ఉన్నాయి.

చిన్నారి మాత్రం రక్తపు మడుగులో పడి ఉంది. ప్రాధమిక సమాచారం బట్టి ఇది ఓ మిస్టరీ గా ఉందని, వాస్తవమేమిటనేది విచారణలో తేలాలిసిందే అని పోలీసులు అంటున్నారు. డోలాసు నగర్ కి చెందిన వెల్లటూరి మరియాదాసు, జ్యోతి దంపతుల మూడవ సంతానం అయిన శ్రావ్య మరణం గ్రామంలో మిస్టరీ గా మిగిలింది.

Girl dies on the nd floor of church building

చర్చి వద్ద ఆడుకుంటూ పైకి వెళ్లిన పిల్లలకు అక్కడ రక్తపుమడుగులో కనిపించింది ఆ చిన్నారి. జరిగిన ప్రమాదం ఏమిటో తెలుసుకునే లోగా చిన్నారిని ఆసుపత్రి కి తరలించారు. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించగా,పరిస్థితి విషమంగా ఉండటటం తో తాడేపల్లి మణిపాల్ కి తరలించారు. మార్గం మధ్యలో చిన్నారి మృతి చెందింది.

అయితే, చర్చి రెండవ అంతస్తులో ఏమి జరిగింది. చిన్నారి ఒంటిపై గౌన్, పట్టీలు ఎవరు తొలగించి ఉంటారు. పాప రక్తపు మడుగులో అపస్మారక స్థితి లో ఎందుకు పడిఉంది. అక్కడ ఏమి జరిగింది ప్రస్తుతానికి అంతా మిస్టరీ గా మారింది.

Girl dies on the nd floor of church building

ఏది ఏమైనా పిల్లలు ఆడుకుంటూ కొట్టుకున్న ఘటనలో శ్రావ్య గాయాలపాలై ఆసుపత్రికి తీసుకుపోగా మరణించిందని అసలు విషయాలు తల్లి దండ్రులు కేసు పెడితే, పోస్టుమార్టంతో బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+