బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్: మాయమాటలు చెప్పేసి బస్సు దించేసి..
అనంతపురం: అనంతపురం జిల్లాలో కామాంధులు అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలానికి చెందిన బాధిత బాలిక సెలవుల్లో కదిరిలో ఉంటున్న తన మామ ఇంటికి వచ్చింది. సంక్రాంతి పండుగ తర్వాత ఆదివారం ఆ బాలికను తిరిగి స్వగ్రామానికి పంపించేందుకు ఆమె మామ ఆటోలో తీసుకుని వచ్చి కదిరి బస్టాండ్‌లో బస్సెక్కించాడు.

ఆ తర్వాత బాలిక తండ్రికి సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్లాడు. ఆ అమ్మాయిని ఆటోలో తీసుకుని వచ్చిన ఆటో డ్రైవర్, మరో నలుగురు యువకులు కుట్ర చేశారు. మీ మామకు యాక్సిడెంట్ అయిందని, తీసుకు రమ్మన్నారని చెప్పి బస్సు నుంచి దింపేసి ఆటోలో తీసుకుని వెళ్లారు.
నల్లమాడ అటవీ ప్రాంతానికి తీసుకుని ఆ బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత పరారయ్యారు. బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ వార్త వినగానే బాలిక తల్లికి గుండెపోటు వచ్చింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications