స్నానంచేస్తుండగా వీడియో తీశారు, బాలిక ఆత్మహత్య

విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పదవ తరగతి విద్యార్థిని స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ సంఘటనలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెట్‌ సెంటర్‌ యజమాని, ఒక విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోతో బెదిరించి ఆ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. చివరికి ఆ బాలిక ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Girl gang raped in AP?

సమాచారం మేరకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలానికి చెందిన బాలిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. ఆమె స్నానం చేస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఒక చిన్నపిల్లవాడి సహాయంతో సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించారని సమాచారం.

ఆ పిల్లవాడికి డబ్బులిచ్చి ముగ్గురు యువకులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియోతో ఆ బాలికను బెదిరించి ఈ ముగ్గురు నెలరోజులుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా వార్తలు వచ్చాయి. వీరి వేధింపులు తట్టుకోలేక పది రోజుల క్రితం ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+