అమ్మాయిపై ఆటో డ్రైవర్ల గ్యాంగ్ రేప్: బాకీకి కూతుళ్ల తాకట్టు

హైదరాబాద్: నిర్భయ లాంటి కఠినమైన చట్టాలు చేసినా మహిళలపై, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో నలుగురు ఆటో డ్రైవర్లు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 16 ఏళ్ల బాలికపై నలుగురు ఆటో డ్రైవర్లు ఆ కిచక పర్వానికి ఒడిగట్టారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

నిజామాబద్ జిల్లాల్లో దౌర్జన్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన వద్ద తీసుకున్న అప్పునకు మరో వ్యక్తి అతని ఇద్దరు కూతుళ్లను బలవంతంగా తాకట్టు పెట్టుకున్నాడు. తీసుకున్న బాకీ తీర్చలేదని చెప్పి కూతుళ్లను తనకు తాకట్టు పెట్టుకున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం మోస్రా గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు జాక్యం చేసుకున్నారు. ఈ ఇద్దరు ఆడపిల్లలను తాకట్టు పెట్టుకున్న వ్యక్తి నుంచి విడిపించి, తండ్రి వద్దకు చేర్చారు.

 Girl gang raped by four auto drivers in Hyderabad

నకిలీ లైసెన్సుల ముఠా అరెస్టు

ఇదిలావుంటే, హైదరాబాదులో నకిలీ లైసెన్స్ ముఠాపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ లైసెన్సులు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. 23 నకిలీ లైసెన్సులను, కంప్యూటర్‌ను, స్కానర్‌ను, 5 సెల్‌ఫోన్లను పోలీసులు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు కేంద్రంగా ఈ నకిలీ లైసెన్సుల తయారీ ముఠా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు.

రౌడీ షీటర్ ఇబ్రహీం అరెస్టు

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ ఇబ్రహీంను సౌత్ జౌన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా ఇబ్రహీం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇబ్రహీం నుంచి 30 తులాల బంగారంతో పాటు విలువైన వస్టువులను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+