నలుగురు కీచకులు: గ్యాంగ్ రేప్ చేసి బాలికను రోడ్డుపై పడేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరులో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నల్లచెరువు 14వ లైన్‌కు చెందిన పద్నాలుగేళ్ల బాలిక గత నెల ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి ఐస్‌క్రీమ్ కొనిస్తామని ఆటోలో తీసుకుని వెళ్లారు.

రెండు సార్లు బాలికపై అత్యాచారం

రెండు సార్లు బాలికపై అత్యాచారం

రెండు సార్లు బాలికపై అత్యాచారం చేశారు. రెండోసారి పొలాల్లోకి తీసుకుని వెళ్లి బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను ఆర్టీసి బస్టాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు హైదరాబాదులో ఉండడంతో సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నలుగురిపై బాలిక తండ్రి ఫిర్యాదు

నలుగురిపై బాలిక తండ్రి ఫిర్యాదు

నల్లచెరువు 14వ లైన్ ప్రాంతానికి చెందిన రంగ, వెంకటేష్, సుబ్బు, సురేష్ తమ కూతురిపై సామూహిక అత్యాచారం చేశారని బాలిక తండ్రి శుక్రవారం లాలాపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

బాలికను ఇలా తీసికెళ్లారు

బాలికను ఇలా తీసికెళ్లారు

తొలుత 23 ఏళ్ల వ్యక్తి వచ్చి బాలికను బలవంతంగా ఆటోలో ఎక్కించాడు. అతను తెలిసిన వ్యక్తి కావడం, ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పడంతో బాలిక పెద్దగా ప్రతిఘటించలేదు. ఆటో కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ముగ్గురు అందులో ఎక్కారు.

ప్రతిఘటించినా కూడా

ప్రతిఘటించినా కూడా

తనక తెలియని ప్రాంతానికి ఆటోలో తీసుకుని వెళ్తుండడంతో బాలిక ప్రతిఘటించింది. అయితే, ఆటోను తొలుత నగరంపాలెంలోని పాడుబడిన పోలీసు క్వార్టర్స్‌లోకి తీసుకుని వెల్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు

 గతంలో కూడా ఇలాంటి పనులే..

గతంలో కూడా ఇలాంటి పనులే..

ఆ తర్వాత సంపత్‌నగర్ కొబ్బరి తోటల్లోకి తీసుకుని వెళ్లి రెండోసారి అత్యాచారం చేశార. బాలికను ఆ సమయంలో తీవ్రంగా కొట్టినట్లు కూడా తెలుస్తోంది. నిందితులు గతంలోనూ ఇద్దరు బాలికలపై లైంగిక దాడి చేసి పెద్దల పంచాయతీతో బయటపడినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl has been gang raped by four men at Gunturu in Andhra Pradesh disrict.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి