మృత శిశువుతో ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా: కొడుకుని చంపిన తల్లి
హైదరాబాద్: ఫిట్స్‌తో మరణించిన ఏడాది పాప మృతదేహంతో ప్రేమించి మోసం చేసిన అనిల్ ఇంటి ముందు మౌనిక అనే యువతి ధర్నాకు దిగింది. కరీంనగర్ జిల్లాలోని రామర్రు మండలం కొరుటపల్లి గ్రామంలో అనిల్ అనే యువకుడు మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత మౌనిక పెళ్లి చేసుకోమని కోరగా అతను నిరాకరించాడు.
దాంతో ఆమె స్థానిక పోలీసు స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. అనిల్ వల్ల జన్మించిన పాప బుధవారం ఫిట్స్ తో మరణించింది. దీంతో ఆగ్రహించిన మౌనిక బంధువులతో కలసి పాప మృతదేహంతో అనిల్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. పోలీసులు సంఘటనాస్థలం వద్దకు చేరుకున్నారు.

ఖైదీ వద్ద సెల్‌ఫోన్
హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలును అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీగా ఉన్న రౌడీషీటర్ కైసర్ నుంచి సెల్‌ఫోన్, సిమ్ కార్డులు, 50 గ్రాముల గంజాయిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కుమారుడిని చంపిన తల్లి
నిజామాబాద్ జిల్లాలో నిత్యం డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చిన తల్లవి ఉదంతం చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం కోటగండిలో డబ్బుల కోసం వేధిస్తున్నాడని తల్లి తన కొడుకునే గొడ్డలితో నరికి చంపింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అదే జిల్లాలోని కామారెడ్డి మండలం శాబ్దిపూర్ బైపాస్ రోడ్డులో కారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరణించిన వారిని అనిల్, నరేష్‌లుగా పోలీసులు గుర్తించారు.
వేటగాళ్ల అరెస్టు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి అటవీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు స్కార్పియోలో వచ్చి దుప్పిని వేటాడారు. అటవీ సిబ్బంది దుప్పిని వేటాడిన ఇద్దరు నిందితులను వెంటాడి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి తపంచా, దుప్పి కళేబరం, స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు.
అదిలా ఉంటే, మెదక్ జిల్లా మునిపల్లి మండలం కంకోల్ దగ్గర లారీ-స్పార్పియో ఢీకొని ఇద్దరు మరణించారు. ఈ సంఘటనలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications