మత్తిచ్చి ఇఫ్లూ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్, నల్గొండలో ఘోరం
హైదరాబాద్/నల్గొండ: తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపారని ఇఫ్లూ విద్యార్థిని ఒకరు సహ విద్యార్థుల పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద గల ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వెజేస్ విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) విద్యార్థిని ఓయు పోలీసులను ఆదివారం ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారు మొన్న రాత్రి విద్యార్థిన పైన సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
కల్లు వద్దని కదం తొక్కిన మహిళలు
కల్లు కాంపౌండ్లు వద్దంటూ మహిళలు ఆదివారం ఉదయం కదం తొక్కారు. వెంకళ్రావు నగర్లో కల్లు కాంపౌండ్ ప్రారంభించిన కాసేపటికే దాని పైన దాడి చేశారు. తమ బస్తీలో కల్లు కాంపౌండులు వద్దని ఆందోళన చేపట్టారు. మళ్లీ కల్లు కాంపౌండులు తెరిచి తమ జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు.
తమ భర్తలు, పిల్లలు కల్తీ కల్లుకు బానిసలై జీవితాలను ఛిద్రం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళలు కల్లు సీసాలను ధ్వంసం చేశారు. తమ ప్రాంత పరిధిలో ఉన్న మూడు కల్లు దుకాణాలను తక్షణం మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పైన వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి.
నల్గొండలో దారుణం
నల్గొండ జిల్లాలోని వేములపల్లిలో దారుణం వెలుగు చూసింది. మదర్సాలలో విద్యార్థులను చైన్లతో కట్టి వేధింపులకు గురి చేశారు. దీంతో మదర్సా నుండి శనివారం అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థులు తప్పించుకున్నారు. వారు ఓ చెట్ల పొదలో తలదాచుకున్నారు. ఆదివారం ఉదయం వారిని గుర్తించిన ఓ రైతు, వి,యం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థులను చైన్లతో కట్టివేయడమే కాకుండా, హింసించే వారని చిన్నారులు తెలిపారు.
లడ్డూలు విక్రయిస్తున్న ఉద్యోగుల అరెస్టు
తిరుమలలో బ్లాక్‌లో లడ్డూలు విక్రయిస్తున్న ముగ్గురు కాంట్రాక్టర్ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 40 లడ్డూ టోకెన్లు స్వాధీనం చేసుకున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications