కుక్కల దాడిలో తెగిన బాలిక ముక్కు: జనంపైకి కారు

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పూగోదావరి జిల్లా సీతానగరం మండలం రాజంపేటలో దారుణ ఘటన జరిగింది. వీధికుక్కలు మూడేళ్ల బాలికపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనలో బాలిక ముక్కు తెగిపోయింది. చికిత్స నిమిత్తం బాలికను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ముక్కు తీసుకొస్తే చికిత్స చేస్తామని డాక్టర్లు తెలిపారు. దీంతో తెగిపడిన ముక్కు కోసం బంధువులు, స్థానికులు ఘటనాస్థలంలో గాలిస్తున్నారు. వీధికుక్కల స్వైరవిహారంతో తరచూ తీవ్రగాయాల పాలవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లానే మరో సంఘటన జరిగింది. రాజమండ్రి వేమగిరి దగ్గర అదుపుతప్పిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Girls nose cut in dogs' attack

బాలికపై పోకిరీల దాడి

సైకిల్ వెళ్తున్న ఓ ఇంటర్ విద్యార్థిని పోకిరీలు బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. దీంతో కిందపడ్డ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో చోటుచేసుకుంది. గాయపడ్డ విద్యార్థిని గమనించిన స్తానికులు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+