టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలివ్వటం పూర్వ జన్మ సుకృతం: టీటీడీ చైర్మన్ భూమన

ఉద్యోగుల సంక్షేమం, ధార్మిక ప్రచారంలో ఎప్పుడూ తాము వెనుకడుగు వేసేది లేదని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. టిటిడి కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో ఎప్పుడు తాము వెనక్కు తగ్గడం లేదని ఎవరైనా విమర్శలు చేసినా, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

ఇప్పటికే టిటిడి ఉద్యోగులకు సంబంధించి తిరుపతి మహతి ఆడిటోరియంలో ఇండ్ల పట్టాల కార్యక్రమాన్ని నిర్వహించిన టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం రెండో విడత ఇండ్ల పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికీ లేనివిధంగా అతి తక్కువ ధరకు ఉద్యోగులందరికీ ఇళ్లపట్టాలు ఇచ్చిన ఘనత టీటీడీకే దక్కుతుందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి తెలియజేశారు.

Giving housing sites to TTD employees is auspicious: TTD Chairman Bhumana karunakar reddy

ఉద్యోగులకు తన చేతులమీదుగా ఇంటిపట్టాల పంపిణీ జరగడం పూర్వజన్మ సుకృతమన్నారు. టీటీడీ ఉద్యోగులకు రెండో విడత ఇంటి పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం నేడు తిరుపతి మహతి ఆడిటోరియంలో వేడుకగా నిర్వహించి అక్కడ వారికి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ వేలాదిమంది ఉద్యోగులకు తన చేతుల మీదుగా ఇళ్ళ పట్టాలు ఇవ్వటం సంతోషం అన్నారు.

ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీపై కొంతమంది విమర్శలు చేశారని, ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధంగా ఉద్యోగులకు నామమాత్రపు ఇంటి స్థలాలు మంజూరు చేశారా చెప్పాలన్నారు. ఉద్యోగులకు మేలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నిస్వార్ధంగా చేస్తున్న ఈ కార్యక్రమంపై కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఆరోపణలకు దిగడం మంచిది కాదన్నారు.

ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో చట్టపరమైన ఇబ్బందులు ఉండడంతో నామమాత్రపు ధరతో ఇళ్ల పట్టాలు మంజూరు చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని తెలిపారు. ఫలితంగా ఇప్పుడు ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగులకు 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం మరో 350 ఎకరాల భూమి కొనుగోలు చేశామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+