జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్.. కారుపై మాట మార్చిన తాత!
కాకినాడ జిల్లా తుని సీహెచ్ ఆగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే మిస్సింగ్ చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని కూడా పారితోషకం ప్రకటించారు.
జ్ఞానేశ్వరి మిస్సింగ్ రోజు కారు, తాతను ఢీకొట్టిన కారు ఒకటే అని ప్రచారం
కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి నెల రోజులు దాటిపోయింది. ఇప్పటివరకు పాప ఆచూకీ కోసం పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటివరకు పాప ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన రోజు సిసిటివి కెమెరాలలో ఒక కారు అనుమానాస్పదంగా కనిపించిందని, ఆ తర్వాత నర్సీపట్నం సమీపంలో పాపకు దాత వరుసగా కోటేశ్వరరావును అదే కారు ఢీ కొట్టిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఒక్కరోజులోనే మాట మార్చిన తాత
ఈ క్రమంలో పోలీసులు సైతం ఈ కారు కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. అయితే తను నర్సీపట్నంలో చిన్నారి మిస్సింగ్ పోస్టర్లు అంటిస్తున్న సమయంలో ఒక కారు తనను డీ కొట్టిందని, అయితే కంగారులో పాప ఇంటి దగ్గర కనిపించిన కారు, తనను ఢీ కొట్టిన కారు ఒకటేనని పొరపాటుగా చెప్పానని ఆయన పేర్కొన్నారు. రెండు కార్లకు ఎటువంటి సంబంధం లేదని ఆయనతో తేల్చి చెప్పారు.
జ్ఞానేశ్వరి మిస్సింగ్ రోజు తిరిగిన కారుపైన పోలీసుల క్లారిటీ
తనపైన ఎవరు దాడి చేయలేదని, తనకు జరిగింది ఒక రోడ్డు ప్రమాదం మాత్రమేనని జ్ఞానేశ్వరి తాత వెల్లడించారు. అయితే జ్ఞానేశ్వరి మిస్సింగ్ జరిగిన రోజున గ్రామంలో తిరిగిన కార్ పైన దర్యాప్తు చేసిన పోలీసులు ఆరోజు అగ్రహారంలో తిరిగిన కారు ఒక శుభకార్యానికి వచ్చిందని, దానికి పాప మిస్సింగ్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
పోలీసులకు పెద్ద సవాల్ గా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు
ఇక మరోవైపు పాప తాత కూడా తనను గుద్దిన కారు, జ్ఞానేశ్వరి మిస్సింగ్ రోజు కనిపించిన కారు ఒకటి కాదు అని చెప్పడంతో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏది ఏమైనా నెల రోజులకు పైగా పోలీసులు ఎంత దర్యాప్తు చేస్తున్నా ఈ కేసులో ఏం జరిగింది అనేది తెలుసుకోలేకపోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.













Click it and Unblock the Notifications