పరిటాల కిల్లర్స్‌కు దేవుడే శిక్ష వేశాడు: సునీత
హైదరాబాద్: తన భర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవిని హత్య చేసినవారికి దేవుడే శిక్ష విధించాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈ నెల 24వ తేదీన అనంతపురం జిల్లా వెంకటాపురంలో రవి పదో వర్ధంతి నిర్వహించనున్నట్లు ఆమె శనివారం చెప్పారు.
పరిటాల రవి వర్ధంతి కార్యక్రమానికి ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తదితరులు హాజరవుతారని ఆమె చెప్పారు. పరిటాల హత్య కేసు పునర్విచారణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడుతానని ఆమె చెప్పారు.

బడ్జెట్ సమావేశాల్లోగా పిఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. మార్చి మొదటివారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. 16 రోజుల పాటు శాసనసభా సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
చట్టాల మార్పుతోనే ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయగలమని యనమల రామకృష్ణుడు అన్నారు. ఒడిశా, తమిళనాడు చట్టాలను అధ్యయనం చేస్తున్నామని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications