వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధవళేశ్వరం వద్ద ఉగ్రగోదావరి: కోనసీమలో జలదిగ్బంధంలోనే గ్రామాలు; రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

|
Google Oneindia TeluguNews

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద నీరు అంతకంతకూ పెరుగుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో వరద ముంపులో చిక్కుకున్న గ్రామాలలో మరింత భయం పెరుగుతోంది.

ధవళేశ్వరం వద్ద ఉగ్రగోదావరి .. కోనసీమలో వరద ప్రమాదం

ధవళేశ్వరం వద్ద ఉగ్రగోదావరి .. కోనసీమలో వరద ప్రమాదం


రాజమండ్రి లోని ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని 18.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో కోనసీమ జిల్లాకు పెను ముప్పు పొంచి ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 16,61,187 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 16.10 అడుగుల నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా కోనసీమ జిల్లాలోని 80కి పైగా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి . కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో రాకపోకలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

పెరుగుతున్న గోదావరి, ఉపనదుల నీటి మట్టం .. పరీవాహక గ్రామాలకు పెను గండం

పెరుగుతున్న గోదావరి, ఉపనదుల నీటి మట్టం .. పరీవాహక గ్రామాలకు పెను గండం

గోదావరి ఉపనదులైన వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి కారణంగా నీటిమట్టం పెరిగితే చుట్టుపక్కల ఉన్న కుగ్రామాలు నీటమునిగే అవకాశం ఉంది. కోనసీమ జిల్లా యంత్రాంగం వరదల సవాల్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపే కంకాయలంక కాజ్‌వే ముంపునకు గురై ఎనిమిది లంక గ్రామాలకు ప్రధాన గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 18 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటి విడుదల ఉంటే 100 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వరదనీరు పోటెత్తడంతో 163 ​​హెక్టార్లలో వరి, నర్సరీలు నీట మునిగాయి.

రంగంలోకి ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు.. వరద బాధితులకు పునరావాసం

రంగంలోకి ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు.. వరద బాధితులకు పునరావాసం

ఇప్పటికే 96 మంది సిబ్బందితో ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 37 పాఠశాలలకు సెలవులు ప్రకటించామని, మరికొన్ని పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఎన్వీ రవిసాగర్‌ తెలిపారు. పాఠశాలలు నీట మునిగిన చోట్ల సెలవులు ప్రకటించాలని కలెక్టర్‌ ఎంఈఓలను కోరినట్లు తెలిపారు. వరద బాధిత ప్రజలకు అనేక పాఠశాలలలో పునరావాసం కల్పించారు. వరద తగ్గిన తర్వాత పాఠశాలలను తెరుస్తామని డీఈవో తెలిపారు. 400 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ చంద్రపాల్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 296 వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు.

కోనసీమ జిల్లా కలెక్టర్ వరద సహాయక చర్యలపై ఏమన్నారంటే

కోనసీమ జిల్లా కలెక్టర్ వరద సహాయక చర్యలపై ఏమన్నారంటే

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తున్న కారణంగా 79 గ్రామాలు ప్రభావితమయ్యాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కపిలేశ్వరం వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 2,500 మందిని ఇప్పటికే తరలించామని పేర్కొన్నారు. నీటి మట్టాలు పెరిగితే మరికొంత మందిని ఖాళీ చేయించి వారికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తామన్నారు. వరద తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. వరదల కారణంగా 400 ఎకరాల్లో నర్సరీలు దెబ్బతిన్నాయన్నారు. నర్సరీలు నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తామని చెప్పారు. కోనసీమ జిల్లాలోని బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏరియల్‌ సర్వే చేయనున్నారని సమాచారం.

English summary
Godavari is experiencing record floods. Godavari continues to rise at Dhavaleshwaram with flood water coming from above. Due to this, villages in Konaseema are under waterlogging. NDRF and SDRF teams entered the field.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X