Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలకు వెళ్తున్నారా? వరుస చోరీలు.. మీకు కీలక హెచ్చరిక!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపైన కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి తిరుమల కొండపై గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగతనాలు జరుగుతుండడం తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు పెద్ద తలనొప్పిగా మారింది.

తిరుమలలో మహిళా భక్తులే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
ఇటీవల కాలంలో వరుసగా తిరుమలలో చోరీలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకుంటున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం తిరుమలలో మహిళా భక్తులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ఆరుగురు పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 87 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Going to Tirumala But here is a key warning for you on thefts

Take a Poll

శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ
రెండు వారాల క్రితం తిరుమల శ్రీవారి లడ్డు కౌంటర్ లోని ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. కౌంటర్ సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో ఓ దొంగ రెండు లక్షలకు పైగా సొమ్మును కాజేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో టిటిడి అధికారులు సీరియస్ అయ్యారు. పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తుచేసి నిందితుడిని గుర్తించారు. గతంలో తిరుమలలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తినే మళ్లీ తిరుమలలో దొంగతనం చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు.

కారు అద్దాలు పగలగొట్టి చోరీ
ఇక ప్రస్తుతం ఈ దొంగను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి మరీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే తిరుమల ఆలయం వెండివాకిలి వద్ద కూడా మహిళా భక్తుల లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడానికి పోలీసులు నానా చావు చావాల్సి వచ్చింది. కాగా నిన్న తిరుమలలో కారు అద్దాలు పగలగొట్టి కారు లోపల బంగారం చోరీ చేయడం కూడా తిరుమలకు వెళ్లే ప్రతి ఒక్కరిని షాక్ గురిచేసింది.

కారు అద్దాలు పగలగొట్టి బంగారం చోరీ
భక్తులు స్వామి దర్శనానికి వెళుతూ కారులోనే సెల్ ఫోన్లు, కొన్ని విలువైన వస్తువులు, బంగారం పెట్టి వెళ్ళారు. శ్రీవారి దర్శనం తర్వాత వచ్చి చూసిన వారికి కారు అద్దాలు పగిలి ఉన్నాయి. లోపల సుమారు 40 గ్రాముల బంగారాన్ని, విలువైన వస్తువులను దోచుకు వెళ్లినట్టు గుర్తించిన సదరు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తిరుమలలో దొంగల బెడద... దొంగల కోసం పోలీసుల తిప్పలు
ఇదే క్రమంలో పోలీసులు తిరుమలకు వచ్చే వారు తమ ఆభరణాలు, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత వరకు సింపుల్ గానే రావడానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. మరోవైపు దొంగలను పట్టుకొని, తిరుమలకు వచ్చే వారికి భరోసా కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడడానికి పోలీసులు, టిటిడి అధికారులు తెగ కష్టపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+