సీఐఐ సదస్సు.. చంద్రబాబు ఇలాకాలో బంగారం శుద్ది చేసే ఫ్యాక్టరీ
రూ.300కోట్ల కోట్లతో బంగారం కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా సీఈవో హనుమప్రసాద్ వెల్లడించారు.
చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలాకాలో బంగారం శుద్ది చేసే కర్మాగారం ఏర్పాటు కాబోతుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆస్ట్రేలియన్ ఇండియా రిసోర్స్ కంపెనీ ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతుంది.
కంపెనీ సీఈఓ హనుమప్రసాద్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని తెలిపారు. రూ.300కోట్ల కోట్లతో బంగారం కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సుకు హాజరైన హనుమప్రసాద్.. మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.

గతేడాది విశాఖలో జరిగిన ఇదే సీఐఐ సదస్సులో.. కర్నూలులో రూ.300కోట్లతో ఇలాంటి ప్రాజెక్టుకే ప్రభుత్వంతో ఎంఓయూ కుదర్చుకున్నామని తెలిపారు. మరో రెండు నెలల్లో దానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications