ఏపీకి స్వర్ణయుగం మొదలైంది.. బంగారం బయటకు వస్తుంది!
భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బంగారం ధర సామాన్యులు కొనుగోలు చేయలేనంత భారీగా పెరిగింది. అందని ద్రాక్షగా మారిన బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడే సామాన్యులకు మనదేశంలోనే దేశీయంగా బంగారం వెలికితీత పనులు ప్రారంభం కావడం భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయనే ఆశలకు కారణంగా మారింది.
జొన్నగిరిలో బంగారు నిక్షేపాలు
మన దేశంలో ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని కర్నూలు జిల్లాలో బంగారం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడంతో పాటు ఇక్కడ ఉన్న బంగారు నిల్వలను నిర్ధారించారు. పగిడిరాయి జొన్నగిరి మధ్య పరిశోధనలు జరిపిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు వెల్లడించింది.

మొదలైన బంగారు ఖనిజం వెలికితీత పనులు
జొన్నగిరి పగిడిరాయి మధ్య 1477 ఎకరాలలో తవ్వకాలకు జియో మైసూర్ కంపెనీ అనుమతులు పొంది పనులను ప్రారంభించింది. ఇక్కడ ఒక టన్ను మట్టి నుండి 1.5 నుండి రెండు గ్రాముల వరకు పసిడి ఉత్పత్తి అవుతుంది. టన్ను మట్టి నుండి 1.5 నుండి రెండు గ్రాముల వరకు బంగారం వెలికి తీయాలంటే సుమారు 5000 రూపాయలు ఖర్చవుతుందని అధికారులు చెప్పారు.
6000 టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యం
వెయ్యి టన్నుల మట్టి శుద్ధి చేస్తే దాదాపు 700 గ్రాముల బంగారం లభిస్తుందని సంస్థ యాజమాన్యం చెప్తుంది. మొత్తం రాబోయే 10 సంవత్సరాలలో ఈ మైనింగ్ సంస్థ ఏపీలోని జొన్నగిరి ప్రాంతం నుండి 6000 టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిరోజు వెయ్యి టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తున్నారు ఇక్కడ దాదాపు కోటి టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.
వేగంగా జరుగుతున్న బంగారం తవ్వకం పనులు
ఈస్ట్ బ్లాక్ లో 180 మీటర్ల లోతులో 6.8 టన్నుల పసిడి ఉన్నట్టు గుర్తించారు. జియో మైసూర్ సంస్థ ఏడాదికి నాలుగు లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికి తీసి 3లక్షల టన్నులను శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అధునాతన యంత్రాలతో ఈ పనిని మరింత వేగవంతం చేస్తూ బంగారం తవ్వకాన్ని చేపట్టారు.
బంగారు ఖనిజం వెలికితీస్తే బంగారం ధరలు తగ్గే ఛాన్స్
దేశంలో ఉన్న బంగారు ఖనిజ నిక్షేపాలను తవ్వి బంగారు ఖనిజాన్ని వెలికితీస్తే మనదేశంలో బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవలసిన అవసరం ఉండదు. అప్పుడు బంగారం ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుందన్న భావన చాలామందిలో వ్యక్తమవుతుంది.
-
అక్కడ వారం రోజులు చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్.. విక్రయిస్తే చర్యలే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications