వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాథమిక చర్చ, 19న మళ్లీ భేటీ: ఆజాద్, సమ్మెపై డిగ్గీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

digvijay singh and Azad
న్యూఢిల్లీ: మంత్రుల బృందంలో విధివిధానాల పరిధి పైన ప్రాథమిక చర్చ జరిగిందని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ శుక్రవారం చెప్పారు. పదకొండు గంటలకు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో మంత్రుల బృందం(జివోఎం) భేటీ అయింది. 45 నిమిషాల పాటు భేటీ జరిగింది. అనంతరం ఆజాద్ విలేకరులతో మాట్లాడారు.

విభజన విషయంలో విధివిధానాల పైన ప్రాథమికంగా చర్చ జరిగిందన్నారు. ఇవాళ్టి సమావేశానికి ఐదుగురు మంత్రులు వచ్చారని, వచ్చే సమావేశానికి అందరు వస్తారని చెప్పారు. ఈ నెల 19వ తేదిన మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఈ రోజు జరిగిన భేటీ షిండే అధ్యక్షతన జరిగిన భేటీలో గులాం నబీ ఆజాద్, జైరామ్ రమేష్, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామిలు పాల్గొన్నారు. కేంద్రమంత్రి చిదంబరం అమెరికా పర్యటనలో ఉన్నందున, ఎకె ఆంటోనీ ఆసుపత్రిలో ఉన్నందున సమావేశానికి హాజరు కాలేదు.

సమ్మె ముగిసినట్లే: డిగ్గీ

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సమ్మె దాదాపు ముగిసినట్లేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం వేరుగా అన్నారు. ఒకటి, రెండు సంఘాలు మినహా సమ్మెను అందరూ విరమించారన్నారు. తుఫాన్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

English summary
Group of Ministers will meet again on October 19, which was formed on AP division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X