జూన్ 2 నాటికి సమస్యల పరిష్కారం, 2 రాష్ట్రాలు: జైరాం
ఢిల్లీ/హైదరాబాద్: జూన్ 2వ తేదీ నాటికి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని, రెండు రాష్ట్రాలు అధికారికంగా ఏర్పడుతాయని కేంద్రమంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్ శుక్రవారం అన్నారు. ఉదయం జివోఎం భేటీ అయింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే వారం జివోఎం మరోసారి భేటీ అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందన్నారు.
జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలు అధికారికంగా ఏర్పడతాయన్నారు. ఆ లోగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. విద్య, విద్యుత్, నీరు మొదలైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం 19 కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అన్ని కమిటీలు ఈ నెలఖరులోగా తమ నివేదికలు అందజేస్తాయని వెల్లడించారు.

రాష్ట్ర విభజనపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించామని చెప్పారు. ఎపి రాజధానిని గుర్తించేందుకు ఐదుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో నిపుణుల ఆ కమిటీ కొత్త రాజధానిని నిర్ణయిస్తుందన్నారు. విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన 19 కమిటీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదికలు అందచేస్తాయన్నారు.
టి పిసిసి కమిటీ భేటీ
తెలంగాణ కాంగ్రెసు పిసిసి సమావేశమై పార్టీ మేనిఫెస్టో పైన చర్చించింది. తెలంగాణ అమరవీరులకు ఏం కావాలి, తెలంగాణ ప్రాంతానికి ఏం కావాలో చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేయనుంది.
ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యులతో కెసిఆర్ భేటీ
ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యులతో కెసిఆర్ భేటీ అయ్యారు. ఇప్పటికే పార్టీ వేదికల పైన ప్రకటించిన హామీలతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ప్రజాకర్షక హామీలు పొందేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications