శుభవార్త: ఏపీలో 200కోట్ల షిప్ యార్డ్.. కాకినాడకు కొత్త కళ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక కంపెనీలకు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానం పలకింది. ఇక ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ తీరాన్ని షిప్ బిల్డింగ్ కేంద్రంగా మార్చే లక్ష్యంతో సాన్ మారిటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 200 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టి షిప్ యార్డ్ ను ఏర్పాటు చేయనుంది.
ఏపీలో షిప్ యార్డ్ కు సాన్ మారిటైమ్ ఒప్పందం
దీనికోసం ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా మారిటైమ్ వీక్ 2025 సందర్భంగా ఈ ఒప్పంద పత్రాలపైన సంతకాలు కూడా చేశారు. కేంద్ర మత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం లో సాన్ మారిటైమ్ తరుపున డైరెక్టర్ షేక్ అహ్మద్ అలీషా, మంత్రిత్వ శాఖ తరపున షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథం సంతకాలు కూడా చేశారు.

2026 - 27 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్న ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్టును 2026 - 27 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ షిప్ యార్డ్ షిప్ నిర్మాణం, రిపేర్, నిర్వాహణ పనులకు అనుకూలంగా రూపొందించబడుతుంది. ఈ షిప్ యార్డ్ లో స్లిప్ వేలు, క్రాలర్ క్రేన్లు, ఫ్యాబ్రికేషన్ షెడ్లు వంటి ఆధ్యాత్మిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం వంద మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఏపీలో షిప్ యార్డ్ కోసం కేంద్రం సహాయం
ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం కూడా అవసరమైన సబ్సిడీలను, సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. షిప్ బిల్డింగ్ మెరైన్ సేవల రంగంలో అనుభవం ఉన్న ఈ కంపెనీ 2047 నాటికి భారత్ పోర్టు సామర్థ్యాన్ని మరింత పెంచేలా పనిచేయనుంది. ఈ ప్రాజెక్టు కాకినాడ డీప్ సి పోర్టును బలోపేతం చేయడం మాత్రమే కాకుండా, స్థానికంగా పోర్టు ఆధారిత పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ షిప్పింగ్ అవకాశాలను కూడా కల్పిస్తుంది.
కాకినాడ తూర్పు తీరం షిప్ బిల్డింగ్ హబ్ గా మారుతుందన్న కేంద్రమంత్రి
అయితే ఈ పోర్టు పర్యావరణ అనుమతులు, నైపుణ్య కార్మికుల కొరత, దీర్ఘకాలిక భూమి లీజులు వంటి సవాళ్లను ఈ ప్రాజెక్టు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ ఒప్పందం సందర్భంగా కేంద్రమంత్రి సర్భానంద సోనోవాల్ మాట్లాడుతూ భారత మారిటైమ్ రంగంలో ప్రపంచ నమ్మకం పెరుగుతుందన్నారు. సాన్ మారిటైమ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కాకినాడ తూర్పు తీరం షిప్ బిల్డింగ్ హబ్ గా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications