ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్తలు.. ఒకటి కాదు డబుల్ బొనాంజా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అదిరిపోయే శుభవార్త చెప్పారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన శుభవార్త చెప్పారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోనే ధాన్యం అమ్మిన నగదును రైతుల ఖాతాలలో జమ చేస్తామని శుభవార్త చెప్పారు. అంతేకాదు రైతులకు పంట బీమా ప్రీమియం ను ఉచితంగా ప్రభుత్వమే చెల్లించేలా ఆలోచన చేస్తుందన్నారు.

గత వైసీపీ పాలనపై భగ్గుమన్న మంత్రి నాదెండ్ల
ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ గత వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వైసిపి ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని నిప్పులు చెరిగారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని విమర్శలు గుప్పించారు.

Good news for AP farmers grain sold cash within 48hours in farmers accounts

రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ
అంతేకాదు గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని ఎట్టి పరిస్థితులలోనూ వాటిని విడుదల చేయాలని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని, సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పటికీ గత నెలలో 1000 కోట్లు విడుదల చేశామని చెప్పిన నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మిగిలిన 674 కోట్లు అందజేస్తున్నామని వెల్లడించారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాలలో 472 కోట్ల రూపాయలు వేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఇక రాష్ట్రంలో రైతాంగానికి మేలు చేసే అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పిన ఆయన ధాన్యం కొనుగోలు విషయంలో ఏ మాత్రం వెనకాడబోమని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

ఆర్థిక అరాచకాలతో బ్యాంకులు భయపడిపోయాయని నిప్పులు
గత ప్రభుత్వం రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని కొనుగోలు చేసిన రైతుల ధాన్యానికి డబ్బులు చెల్లించలేదని 40,500 కోట్ల రుణాలు సివిల్ సప్లై సంస్థ పేరు మీద గత జగన్ సర్కార్ తీసుకుందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాలతో బ్యాంకులు భయపడిపోయాయని నిప్పులు చెరిగారు.

రైతుల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం
ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఫోన్లు చేస్తున్న బ్యాంకర్లు ఫోన్లు ఎత్తడం మానేశారని నాదెండ్ల మనోహర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ హయాంలో రైతులకు టార్పాలిన్స్ కూడా ఇవ్వలేదని 50 శాతం సబ్సిడీతో టార్పాలిన్లు తాము అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+