ఏపీ, తెలంగాణా పర్యాటకులకు irctc శుభవార్త.. అతితక్కువ ఖర్చుతో దివ్య దక్షిణయాత్ర.. ఎప్పుడంటే!!
అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన భారత్ గౌరవ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించాలి అనుకునే వారికి, పుణ్యక్షేత్రాల సందర్శన చేయాలనుకునే వారికి గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను దర్శించడానికి అవకాశం కల్పిస్తున్న భారత్ గౌరవ రైలు మరోమారు దివ్య దక్షిణ యాత్ర కోసం సిద్ధమవుతోంది.
జూలై 19 వ తేదీ నుండి జూలై 26 వ తేదీ వరకు దివ్య దక్షిణ యాత్ర
తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 19 వ తేదీ నుండి జూలై 26 వ తేదీ వరకు ప్రత్యేక ప్యాకేజీని "భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్" ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.

టికెట్ ధరలు ఇలా
దివ్యదక్షిణయాత్ర జ్యోతిర్లింగంతో (SCZBG45) రైలు తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులను చుట్టేస్తూ ఈ యాత్ర జూలై 19 వ తేదీన ప్రారంభమై 26 వ తేదీ వరకు సాగుతుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14100, థర్డ్ క్లాస్ ఏసీ ధర 22300, సెకండ్ క్లాస్ ఏసీ ధర 29200 ఉంటుంది.
ఏపీ, తెలంగాణాలలో ఈ రూట్లో టూరిస్ట్ రైలు
ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా సాగుతుంది. ఇటు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగే ఈ దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర లో భాగంగా టూరిస్ట్ లకు అన్ని సదుపాయాలను irctc కల్పిస్తుంది.
అన్ని వసతులతో పర్యాటక ప్రాంతాల సందర్శన
రైలు, బస్సు, హోటల్ లో వసతి నుండి, ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం, వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కార్ట్ సేవలతో సందర్శనా స్థలాలను చూపిస్తుంది. ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితంగా అందించనుంది. ప్రతి రైలు లో 639 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కో ఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు సమకురుస్తారు.
టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇలా చెయ్యండి
కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701,9281495845,9281495843,9281030749 లకు సంప్రదించాలని. మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రధించాలని ఐఆర్సిటిసి టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications