వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..
ఢిల్లీ మెట్రో రైలు వ్యూహకర్త శ్రీధరన్ ఓ సందర్భంలో భారతదేశానికి బుల్లెట్ రైళ్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆయన అలా చెప్పారంటే దాని వెనక బలమైన కారణం ఉంటుంది. బుల్లెట్ రైళ్లల్లో టికెట్ ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న రైలు టికెట్లమీద నాలుగు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తాజాగా పట్టాలపైకి వచ్చి వందేభారత్ రైళ్లల్లో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంట విమర్శలు వస్తున్నాయి. కొన్ని మార్గాల్లో ధరలు ఎక్కువగా ఉండటంతో ఆక్యుపెన్సీ లేకుండానే వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.
ప్రస్తుతానికి మరిన్ని వందే భారత్ రైళ్లనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలకు వీటి సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 25 వందే భారత్ లు నడుస్తుండగా, ఈ నెలాఖరులో మరో నాలుగు అందుబాటులోకి రానున్నాయి. సంవత్సరానికి 35 రైళ్లు పట్టాలెక్కేలా ఆ శాఖ ప్రణాళికలు రచించుకుంది.

రంగులు కూడా కొత్తవి వేయబోతున్నారు. ప్రస్తుతం లైట్ ఆరెంజ్ వేస్తున్నారు. బ్ల కలర్ నుంచి లైట్ ఆరెంజ్ కు మార్చారు. కొందరు ఆరెంజ్ అంటున్నారు.. మరికొందరు కాషాయం అంటున్నారు. కొత్తగా పలు రంగులు వేయడంవల్ల రైళ్లకు మంచి లుక్ వస్తోంది. కొత్తగా వచ్చే వాటిల్లో 8 కోచ్ లు ఉంటాయి. ఏడు చైర్ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ కింద ఉంటాయి.
అందుబాటులోకి రానున్న నాలుగు వందే భారత్ రైళ్లు చెన్నై-తిరునల్వేలి, లక్నో-ప్రయాగ్‌రాజ్, ఢిల్లీ-ఛండీగఢ్, గ్వాలియర్-భోపాల్ మధ్య తిరగనున్నాయి. వీటితోపాటు విజయవాడ-చెన్నై మధ్య మరో వందే భారత్ కూడా నడిపించడానికి ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ నెలాఖరులోగా నాలుగు వస్తాయా? ఐదు వస్తాయా? అనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు.












Click it and Unblock the Notifications