ఏపీలో డ్వాక్రా మహిళలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఏపీలో మహిళల సంక్షేమం కోసం, వారి ఆర్థిక స్వావలంబన కోసం పలు పథకాలను అమలు చేస్తున్న ఏపీ సర్కార్, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఆర్థిక ఊతం ఇవ్వడానికి కృషి చేస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడానికి కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తోంది.

డ్వాక్రా మహిళల ఉపాధికి క్లస్టర్ లు
ఇప్పటికే కేంద్రం గుంటూరులో పచ్చళ్ల తయారీకి, బాపట్ల, కర్నూలులో చేనేత క్లస్టర్ లను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో మరో ఆరు క్లస్టర్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పనులను వెంటనే ప్రారంభించాలని కూడా కేంద్రం సూచించింది. మరో వారం పది రోజుల్లో మిగతా ఆరు క్లస్టర్ లకు కూడా అధికారిక అనుమతులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Good news from the Center for dwcra women in AP a hundred crores at once for 9 clusters

Take a Poll

వేల సంఖ్యలో మహిళలకు ఉపాధి
ఈ క్లస్టర్ ల ద్వారా 11,475 మంది మహిళలు ఉపాధి పొందనున్నారు. మరో వారం, పది రోజుల్లో మిగిలిన క్లస్టర్ లకు కూడా అధికారిక అనుమతులు రానున్న నేపథ్యంలో పనులు ప్రారంభించుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపడుతున్నాయి. మొత్తం 100 కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికలను ఇప్పటికే రాష్ట్ర అధికారులు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.

ఏపీలో ఏర్పాటు చేసే క్లస్టర్ లు ఇవే
చేనేత క్లస్టర్లు ఒక్కొక్క దానికి ఐదు కోట్లు, పచ్చళ్ళు తయారీ క్లస్టర్లకు 22కోట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాలో పచ్చళ్ళు తయారీ క్లస్టర్ తో 2500మంది డ్వాక్రా మహిళలకు ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. విజయనగరంతో పాటు, మరో జిల్లాలో మిల్లెట్ క్లస్టర్, జక్కంపూడిలో సాంకేతిక క్లస్టర్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసే పర్యాటక క్లస్టర్, ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో ఆహార ఉత్పత్తుల క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు.

ఏపీని పురోగతి వైపు నడిపిస్తున్న కేంద్రం
ఇక వీటివల్ల డ్వాక్రా మహిళలకు, యువతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలో పారిశ్రామికంగా అభివృద్ధికి అనేక క్లస్టర్ లు ఏర్పాటు చేసిన కేంద్రం ఏపీని మరింత పురోగతివైపు నడిపించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ అవకాశాన్ని చంద్రబాబు సర్కార్ కూడా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+