ఏపీలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులపై శుభవార్త.. కీలక ఆదేశాలిచ్చిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పురోగమన దిశగా ముందుకు తీసుకువెళ్ళే పనిలో ఉంది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మూడు పోర్టులను 2026 ఏడాది చివరి నాటికి పూర్తి చేసి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధం చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్‌&బీ శాఖల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష

సచివాలయంలో తాజాగా గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పోర్టు నిర్మాణాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వేగంగా పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Good news on greenfield ports Minister BC Janardhan Reddy said to complete by the end of 2026

ప్రాజెక్ట్ లు టైమ్ లైన్‌లో పూర్తి చేసేందుకు ప్రత్యేకదృష్టి

ఈ గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు పూర్తికావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాణిజ్యరంగంలో భారీ అభివృద్ధి సాధించడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థికవ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను టైమ్ లైన్‌లో పూర్తి చేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తోందన్నారు. రాష్ట్రంలో మంజూరైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ, అటవీ అనుమతులు వంటి అడ్డంకులను తొలగించి, పనులు వేగంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సూచించారు.

మూలపేట పోర్టు

మూలపేట పోర్టు నిర్మాణం విషయంలో పునరావాస కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. దీంతో డ్రెడ్జింగ్ పనులు సకాలంలో పూర్తి చేయవచ్చని అన్నారు. ఉప్పు భూముల సమస్య, రోడ్డు సదుపాయాలు, రైల్వే లైన్ నిర్మాణం, ఆర్‌&ఆర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పోర్టు సమీప ప్రాంతాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

మచిలీపట్నం పోర్టు

మచిలీపట్నం పోర్టు విషయంలో రైల్వే లైన్‌తో అనుసంధానం, విద్యుత్ సరఫరా, మంచినీటి వసతి వంటి మౌలిక సదుపాయాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. బ్రేక్‌వాటర్ మరియు డ్రెడ్జింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ పోర్టు రాష్ట్ర వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

టీటీడీ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు.. ఫ్రీ ఎడ్యుకేషన్ హాస్టల్, ఫుడ్.. అప్లై చేసుకోండి!
టీటీడీ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు.. ఫ్రీ ఎడ్యుకేషన్ హాస్టల్, ఫుడ్.. అప్లై చేసుకోండి!

రామాయపట్నం పోర్టు

రామయపట్నం పోర్టు విషయంలో డ్రెడ్జింగ్ పనులు మరియు పునరావాస కార్యక్రమాల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పోర్టు కూడా సమయానికి పూర్తి కావాలని మంత్రి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+