హైదరాబాద్ నుండి విజయవాడకు రెండు గంటల్లోనే, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులపై సూపర్ అప్డేట్!
తెలుగు రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించి రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మచిలీపట్నం బందరు వరకు నిర్మాణానికి కేంద్రం ఇటీవల అనుమతులు జారీ చేసింది. ఇక తాజాగా దీనిపై మరో శుభవార్త చెప్పారు తెలంగాణా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి కన్సల్టెన్సీ
హైదరాబాద్ అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు కు సంబంధించి తాజాగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి కన్సల్టెన్సీని నియమించే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ రోడ్డుని ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? ఎక్కడ అనుసంధానం చేయాలి? కీలకమైన ఎంట్రీ పాయింట్లు ఎక్కడ? అనేది ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చ జరిగింది.

టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 2026 ఫిబ్రవరిలో పనులు
ఇక తాజాగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనుల కోసం డీపీఆర్ ఎస్టిమేట్ లు త్వరలోనే పూర్తికానున్నాయని ఆయన పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ మధ్య అధునాతన టెక్నాలజీతో ఎనిమిది వరుసలతో యాక్సిడెంట్ ఫ్రీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని తెలిపారు.
హైదరాబాద్ నుండి విజయవాడకు కేవలం రెండు గంటల్లోనే
విజయవాడ రోడ్డు పైన యాక్సిడెంట్ల నియంత్రణ కోసం 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ విషయం పైన సానుకూలంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం త్వరలో పూర్తి అయితే హైదరాబాద్ నుండి విజయవాడకు కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చని మంత్రి వెల్లడించారు.
తుది అలైన్మెంట్ ను ఖరారు చేసి డి పి ఆర్ కేంద్రానికి
రెండు తెలుగు రాష్ట్రాలు దీనిపైన ఒక అభిప్రాయానికి వస్తే రెండు రాష్ట్రాల అంగీకారంతో తుది అలైన్మెంట్ ను ఖరారు చేసి డి పి ఆర్ ను కేంద్రానికి పంపుతారని కేంద్రం అనుమతించిన తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం పనులు ప్రారంభిస్తారు. ఏపీ తెలంగాణ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ను నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించడానికి కేంద్రం ఓకే అంది.












Click it and Unblock the Notifications