ఏపీలో కోటిమంది ప్రజల నెత్తిన పాలు పోసిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ పోతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంచి విజన్ ఉన్న నాయకుడిగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర పథకాలు సరిగా అమలు కాకపోవడాన్ని, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధికి విఘాతం కలిగించడం గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆ తప్పులు దిద్దే పనిలో ఉన్నారు.

ఆ కేంద్ర పథకంపై పవన్ కళ్యాణ్ శుభవార్త
ఇప్పటికే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులు, ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించడానికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్, తాజాగా మరొక స్కీంపైన శుభవార్త చెప్పారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి రాష్ట్రానికి నిధులను కేటాయించింది.

Good news Pawan Kalyan saved the central scheme that will benefit one crore people

Take a Poll

జల్ జీవన్ మిషన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్
ఈ పథకం అమలుకు, గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరాకు నిర్దేశిత సమయాన్ని కూడా ప్రకటించింది. అయితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను దెబ్బతీసేలా దాని గురించి పట్టించుకోకుండా వ్యవహరిస్తే, ప్రస్తుత కూటమి సర్కార్, ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు.

నాలుగేళ్ళు జల్ జీవన్ మిషన్ పథకాన్ని పొడిగించిన కేంద్రం
గత ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులు సకాలంలో వినియోగించుకోవడం వల్ల మురిగిపోయే పరిస్థితి వస్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రానికి అభ్యర్థించారు. దీంతో కేంద్రం వీరి అభ్యర్థన మేరకు జల్ జీవన్ మిషన్ పథకం నిర్దేశిత గడువును మరో నాలుగేళ్లపాటు పొడిగించింది. ఐదుజిల్లాల పరిధిలో దీనితో 7910 కోట్ల రూపాయల పనులను చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి మంది దాహార్తి తీరే అవకాశం ఉంది.

ప్రకాశం జిల్లాలో మెగా ప్రాజెక్ట్
రానున్న 30 సంవత్సరాల కాలానికి కోటి 21 లక్షల 71 వేల మందికి రక్షిత మంచి నీటిని ఇవ్వాలి అన్న సంకల్పం ఈ పథకంతో తీరుతుంది. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడి ప్రజల కష్టాన్ని తీర్చడానికి గత జులై 4వ తేదీన 1290 కోట్లతో మెగా ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.

ఈ జిల్లాలలో తాగునీటి సరఫరా మెగా ప్రాజెక్ట్ లు
ఇది మాత్రమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, చిత్తూరు జిల్లాలో తాగునీటి సరఫరాకు మెగా ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ఇక ప్రతి పనిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని చేకూర్చేలా, రక్షిత మంచినీటిని అందించిన చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+