ఏపీ ప్రజలు సంబరాలు చేసుకునే శుభవార్త.. బీసీలు, నిరుద్యోగులకు భలే ఛాన్సులే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో బీసీల కోసం, వారికి సంక్షేమ పథకాలను అందించడానికి, స్వయం ఉపాధి పథకాలను అందించడానికి కీలక నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తోంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు కొన్ని పథకాలను రూపొందించి చంద్రబాబుకు పంపించారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సంక్షేమ పథకాల అమలు జరుగుతుంది.ఇది బీసీలు, నిరుద్యోగుల నెత్తిన పాలుపోసిన శుభవార్త.
బీసీల కోసం స్వయం ఉపాధి పథకాలు
ముఖ్యంగా బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే సంక్షేమ పథకాలను అందించడానికి నిర్ణయించిన బీసీ సంక్షేమ శాఖ ఈ మేరకు మహిళలకు టై.లరింగ్ శిక్షణ ఇప్పించడానికి నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 వేల మంది బీసీ, ఈబీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా బీసీల ద్వారా జనరిక్ మందుల షాపులను పెట్టించి వారికి స్వయం ఉపాధి కల్పించడానికి నిర్ణయం తీసుకుంది.

మహిళలకు 24 వేలు.. ఉచిత శిక్షణ
స్వయం ఉపాధి పథకాల రుణాలు దరఖాస్తుల కోసం ఆన్లైన్లో ఓబి ఎంఎస్ వెబ్సైట్ ని కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. బీసీ, ఈ బీసీ మహిళలకు 90 రోజులపాటు రోజుకు నాలుగు గంటల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి టైలరింగ్ శిక్షణ పూర్తయిన తర్వాత వారికి 24వేల రూపాయల విలువ కలిగిన కుట్టుమిషన్లను ఉచితంగా అందిస్తారు. ఈ మేరకు శిక్షణ కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకుంది బీసీ సంక్షేమశాఖ.
జనరిక్ మందుల షాపులకు లోన్లు
ఇక జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్న క్రమంలో బీసీ, ఈ బీసీ యువతకు ముఖ్యంగా ఫార్మా డీ, , బీ ఫార్మసీ చదివి సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉపాధి కల్పించడం కోసం జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేయడానికి కూడా సహకారం అందించనుంది. ఈ మేరకు జనరిక్ మందుల షాపుల అభివృద్ధికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారికి 8 లక్షల రూపాయల లోను అందించనున్నారు.
సగానికి సగం సబ్సిడీతో చేయూత
ఈ ఎనిమిది లక్షల రూపాయల లోన్ లో నాలుగు లక్షలు సబ్సిడీగా, మిగిలిన నాలుగు లక్షలు తిరిగి చెల్లించేలాగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ స్వయం ఉపాధి పథకాల ప్రపోజల్ ను సీఎం చంద్రబాబు ముందు ఉంచారు. ఆయన అనుమతి రాగానే వీటిని అమలు చేయడానికి రంగంలోకి దిగుతారు.
యువతకు ఉద్యోగాల కల్పన
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా సీడాప్ ద్వారా యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని, ఉద్యోగాల కల్పన చేయాలని నిర్ణయించారు, 2025 జనవరి నుంచి పదివేల మంది యువతకు వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ నుండి శిక్షణ ఇస్తారని ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించిన విషయం తెలిసిందే.
వారికి ఉపాధి చూపించేలా కూటమి సర్కార్ ప్లాన్
మెడికల్ స్టోర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, సీ ఫార మ్స్, పౌల్ట్రీ ఫారాలు వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఈ మేరకు ఆ యూనిట్ల నుండి వచ్చే ఉత్పత్తులు కూడా ప్రభుత్వమే మార్కెటింగ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా బీసీలకు, యువతకు, మహిళలకు మేలు చేకూర్చే లాగా, ఉపాధి చూపించే విధంగా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తుంది.












Click it and Unblock the Notifications