తిరుపతి వెళ్లేవారికి శుభవార్త.. ఆ రైల్వే లైన్, కొత్త స్టేషన్లతో ఆ ప్రాంతానికి మహర్దశ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన రైల్వే తన ప్రత్యేకమైన దృష్టిని సారించి ప్రగతి అడుగులు వేస్తోంది. ఏపీలో కొత్త రైల్వే లైన్ల పనులను శరవేగంగా కొనసాగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మీదుగా సాగే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది.
ప్రకాశం జిల్లాలో జోరుగా రైల్వే అభివృద్ధి పనులు
ఈ రైలు మార్గ పనులు ప్రకాశం జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. దర్శి ,పొదిలి ప్రాంతాలలో ట్రాక్ నిర్మాణంతోపాటు, రైల్వే స్టేషన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కనిగిరి నియోజకవర్గంలో పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ మార్గంలో ఎడవల్లి, కనిగిరి పోలవరం వద్ద నిర్మించిన రెండు రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ట్రయల్ రన్ లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.

రైల్వే లైన్, రైల్వే స్టేషన్ లతో అక్కడ ప్రజలకు సంతోషం
తాజాగా కనిగిరి నియోజకవర్గం లోని గార్ల పేట రోడ్డు సమీపంలో మూడో రైల్వే స్టేషన్ కూడా సిద్ధమైంది. ఈ మూడు రైల్వేస్టేషన్ల నిర్మాణం పూర్తి కావడంతో కనిగిరి మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనిగిరి మండలం లో రైల్వే స్టేషన్లు, క్వార్టర్స్ తో పాటుగా ప్లాట్ ఫామ్ లు కూడా సిద్ధమయ్యాయి.
జనవరి నుండే రైళ్ళు నడుస్తాయన్న ఎమ్మెల్యే
జనవరి మొదటివారం నుండే కనిగిరి మండలంలో రైళ్లు నడుస్తాయని కనిగిరి ఎమ్మెల్యే ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా కనిగిరి రైల్వే స్టేషన్ నుంచి కొత్త రైల్వే లైను నిర్మాణం కూడా జరుగుతోందని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఇది msme పార్కుకి అనుసంధానంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ రైల్వే లైన్ తో ప్రకాశం జిల్లాలో వారికి రవాణా సౌకర్యం
సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా దీని పైన దృష్టి సారించారని, ఈ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం భూసేకరణ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఈ రైల్వే లైను అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లాలోని ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ కారణంగా ఇటు ప్రకాశం జిల్లాకు మాత్రమే కాక తిరుపతికి ప్రయాణం చేయాలనుకునే వారికి కూడా ప్రయాణం మరింత సులువుగా సాగుతుంది.
కూటమి హయాంలో రైల్వే లైన్ పనుల వేగం
ఏది ఏమైనా గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రైల్వే లైను నిర్మాణ పనులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో దూకుడుగా సాగుతున్నాయి. జనవరిలోనే ఈ మార్గంలో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications