ఏపీలో ఆ కొత్త జాతీయ రహదారి విస్తరణపై శుభవార్త.. ఎలివేటేడ్ కారిడార్ తో డీపీఆర్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ పైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ను ఆరు వరుసలుగా విస్తరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఇక తాజాగా మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడం కోసం సన్నాహాలు జరుగుతున్న క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షించారు.

డీపీఆర్ లో మార్పులు
జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ఇటీవల జరిగిన సమావేశంలో కన్సల్టెన్సీ తయారుచేసిన డీపీఆర్ పై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు వ్యక్తం చేసిన అభ్యంతరాలపైన జాతీయ వివరణ కోరిన ఆయన ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ల సూచనలను పరిశీలించి డిపిఆర్ లో చేర్చాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న డిపిఆర్ డిజైన్ పైన ముఖ్యంగా బెంజ్ సర్కిల్, చిన్న ఓగిరాల మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వాహన అండర్పాస్ లు లేకపోవడాన్ని ప్రస్తావించి, మార్పులు చేయాలని సూచించారు.

good news Vijayawada Machilipatnam National Highway six-lane expansion project with elevated corridor

Take a Poll

పైన మెట్రో, కింద రోడ్డు ఉండేలా డబుల్ డెక్కర్ నిర్మాణం
మెట్రో రైల్ అధికారులతో సంప్రదించి మూడు ప్రత్యామ్నాయ డిజైన్లను సిద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు, అధికారులకు ఆదేశం ఇచ్చారు. విజయవాడ నుంచి పెనమలూరు వరకు మెట్రో లైన్ ప్లాన్ చేస్తే పైన మెట్రో, కింద రోడ్డు ఉండేలా డబుల్ డెక్కర్ నిర్మాణంగా రూపొందించాలని కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు సూచనలు చేశారు.

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 65 మధ్య కొత్త లింకురోడ్లు
ఇక శివారు ప్రాంతాల నుండి పోర్ట్ ఏరియాల నుండి వాహన రద్దీ ఉన్నదని, ఈ క్రమంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు జాతీయ రహదారి 16 జాతీయ రహదారి 65 మధ్య మెరుగైన అనుసంధానం కోసం కొత్త లింకు రోడ్లను ఏర్పాటు చేయాలని, అండర్ పాస్ లను, జంక్షన్ లను నిర్మించాలని, స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రజాప్రతినిధులు సూచించారు.

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ప్రతిపాదన
విజయవాడ మచిలీపట్నం మధ్య 64 కిలోమీటర్ల మేర ఉన్న రహదారిని ఆరు రహదారులుగా విస్తరిస్తున్న క్రమంలో కృష్ణ జిల్లాలో 62 కిలోమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు కిలోమీటర్ల మీరు రహదారి విస్తరణ పనులను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. బెంజ్ సర్కిల్ నుంచి కానూరు వరకు ఆరు వరుసలుగా రహదారిని విస్తరించే అవకాశం లేకపోవడంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు.

మళ్ళీ డీపీఆర్ మార్చి కేంద్రానికి పంపనున్న ఏపీ
అయితే కన్సల్టెన్సీ తయారుచేసిన డీ పి ఆర్ లో ఎలివేటెడ్ కారిడార్ ప్రస్తావన లేకపోవడంతో ఈ ప్రతిపాదనలను కూడా కలిపి కన్సల్టెన్సీ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రస్తావన లేకపోవడంతో, తాజాగా ఈ ప్రతిపాదనలను కలిపి కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ మార్పులు చేర్పులు చేసిన తర్వాత డి పి ఆర్ ను కేంద్ర అనుమతిస్తే ప్రాజెక్టు పనులు వేగంగా ప్రారంభించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+