వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారికేనా: టిడిపిపై గోరంట్ల తీవ్ర వ్యాఖ్యలు, బంద్‌కు కాగిత వెంకట్రావు పిలుపు

టిడిపిలో టీవల జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని, అందుకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నా

|
Google Oneindia TeluguNews

అమరావతి: టిడిపిలో టీవల జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని, అందుకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. పార్టీలో మొదటి నుంచి నమ్ముకున్న, త్యాగాలు చేసిన వారికి గుర్తింపు లభించడం లేదని, ఆయారాం, గయారాంలకు పదవులు దక్కుతున్నాయన్నారు.

అయిదుదుసార్లు గెలిచిన తాను మంత్రి పదవి ఆశించానని, పార్టీలు మారిన వారికి అందలమెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షోభాల్లో తన సేవలను పార్టీ వినియోగించుకుందన్నారు. ఎన్టీఆర్‌, పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు.

gorantla-buchchaiah-choudary

గోరంట్లకు మద్దతుగా ఎమ్మెల్యేకు మద్దతుగా టిడిపి నగర అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు సహా కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా రాజీనామాలు చేశారు. సీనియర్ నాయకుడైన బుచ్చయ్య రాజీనామా చేయడంతో రాజమండ్రి టిడిపిలో సందిగ్ధత నెలకొంది.

సామాజిక సమీకరణాలు, ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేశాకే మంత్రుల జాబితాను సీఎం చంద్రబాబు రూపొందించారని, పదవి దక్కని వారు నిరాశచెందకూడదని, వారికి అన్నివేళలా పార్టీ అండగా ఉంటుందని అలకబూనిన ఎమ్మెల్యేలను పలువురు సీనియర్ మంత్రులు బుజ్జగిస్తున్నారు.

పార్టీ అవమానించింది

పార్టీ నిబంధనలు చాలా దారుణంగా ఉన్నాయని గోరంట్ల మండిపడ్డారు. రాజమండ్రి సీటు విషయంలోను పార్టీ తనను దారుణంగా అవమానించిందని చెప్పారు. పార్టీలో సీనియర్లకు లెక్కలేదా అని అడిగారు.

కాగితపు వెంకట్రావు రాజీనామా బంద్‌కు పిలుపు

పెడన ఎమ్మెల్యే కాగితపు వెంకట్రావు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. సీఎంను కలిసిన తర్వాత రాజీనామా చేస్తానని చెప్పారు. తనను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాగితపు వెంకట్రావు.. రేపు (సోమవారం) పెడన బంద్‌కు పిలుపునిచ్చారు. ఆయనకు మద్దతుగా పలువురు నేతలు రాజీనామా చేస్తున్నారు.

English summary
Gorantla Buchaiah Choudhary resigns, Kagitha Venkata Rao ready to quit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X