వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాములోరికి గోటి తలంబ్రాలు.. కోటి ఆక్షితలు, భద్రాద్రితోపాటు ఒంటిమిట్టకు కూడా

|
Google Oneindia TeluguNews

సీతారాముల కల్యాణం.. కమనీయంగా జరుగుతుంటుంది. ఏటా ఏప్రిల్‌లో నవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకగా కల్యాణ ఘట్టం జరుగుతుంది. అయితే సీతారాముల తలంబ్రాలకు విశిష్టత ఉన్న సంగతి తెలిసిందే. అవీ మాములుగా కాకుండా.. గోటితో కోటి అక్షితలను తీస్తారు. ఈ సారి కూడా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఆ పని జరుగుతుంది.

ఏటా భద్రాచలంతోపాటు ఒంటిమిట్ట రామాలయానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందిస్తారు. ఇందుకోసం స్వయంగా రామ పంట పండిస్తుండటం విశేషం. 3 నెలలు శ్రమించి పంట పండిస్తారు. 8 వందల కేజీలు బియ్యంను గోటితో వలుస్తారు. అలా కోటి తలంబ్రాలను తయారు చేస్తున్నారు. కోటి తలంబ్రాల తయారీలో 60 గ్రామాల్లోని రామభక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

goti talambralu for sita ramula kalyanam

వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న కొందరు రామ భక్తులు కూడా ఈ మహత్కార్యంలో పాలుపంచుకునేందుకు వస్తున్నారు. 2 వందల గ్రాముల ప్యాకెట్ల రూపంలో ఒడ్లను వారికి పంపిస్తున్నారు. ఈ ఏడాది కోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభం కావడంతో సీతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా కోటి తలంబ్రాలు అందిస్తున్నారు. గత 6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ కూడా కోటి తలంబ్రాలను అందిస్తున్నారు.

కలియుగ దైవం శ్రీరాముడి.. కల్యాణం కమనీయంగా జరుగుతుంటుంది. కరోనా వల్ల ఆంక్షలు ఉంటున్నాయి. కానీ ఇంతకుముందు వైభవంగా జరిగేవి. స్వయంగా ముఖ్యమంత్రి పట్టువస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించేవారు. కానీ ఇప్పుడు వైరస్ వల్ల జనాన్ని కూడా రానీయడం లేదు. గత ఏడాది కరోనా జోరుగా ఉండేది. మరీ ఈ సారి ఎలా ఉంటుందో చూడాలీ. ఇప్పటి వరకు అయితే సిచుయేషన్ బాగానే ఉంది. కానీ మార్చి, ఏప్రిల్‌లో ఎలా ఉంటుందో.. ఆ సమయానికి సెకండ్ డోసు పూర్తవుతుంది. కానీ బూస్టర్ డోసు అందరికీ పూర్తయితే తప్ప సేఫ్ కాదు. సో.. ఈ వేసవి కాస్త ఇబ్బంది పెట్టే మాదిరిగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary
goti talambralu for sita ramula kalyanam. east godavari farmers are prepared talambralu for bhadrachalam and ontimitta sri sita ramulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X